
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్(ఏఎస్‌జే) కూటమి ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ ప్యానెళ్లపై విజయం సాధించింది. ఏఎస్‌జే కు 1,977 ఓట్లు రాగా.. ఏబీవీపీకి 1,569 ఓట్లు, ఎన్‌ఎస్‌యూఐకి 872 ఓట్లు లభించా యి. నోటాకు 249 ఓట్లు నమోదయ్యాయి. ఏఎస్‌జే కూటమి తరఫున అధ్యక్షుడిగా పి.శ్రీరాగ్, ఉపాధ్యక్షునిగా లునావత్ నరేశ్, ప్రధాన కార్యదర్శిగా ఆరీఫ్ అహ్మాద్, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ ఆసిఫ్, సాంస్కృతిక కార్యదర్శిగా గుండేటి అభిషేక్, క్రీడల కార్యదర్శిగా లోలం శ్రావణ్ ఎన్నికయ్యారు.