సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్‌బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.
This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case.
The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024
వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst
Comments
Please login to add a commentAdd a comment