హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని మోహిని మిశ్రా గత అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని మోహిని మిశ్రా గత అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. యూనివర్శిటీ ప్రాంగణంలోని నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కింద పడి మోహినిమిశ్రా మరణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో వారు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసులు యూనివర్శిటీ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఇద్దరు యువకులతో కలసి పార్టీ చేసుకుంటుండగా ఆ ప్రమాదం చోటుచేసుకుందని వారు పోలీసులకు వివరించారు. పోలీసులు ఆ ఇద్దరు యువకులును అదుపులోకి తీసుకుని చందానగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మోహిని మిశ్రా మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.