
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో శుక్రవారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించడంతో ప్లేఆఫ్ బెర్త్ పోటీ రసవత్తరంగా మారిపోయింది. కేవలం నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్తాన్, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్‌లు పోటీ పడుతున్నాయి. ఈ నాలుగు జట్లలో ఏం జట్టు ప్లేఆఫ్ చేరుతుందనేది సోమవారంతో తేలనుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో ఇరగదీసి విజయం అందించడంతో హీరోలుగా మారిపోయారు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో గేల్‌ను ఆర్చర్ ఔట్ చేయడంతో అతను హీరోగా మారిపోయాడు. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్)
దీనికి రాజస్తాన్ యాజమాన్యం తమ ట్విటర్‌లో వినూత్నమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. రాజస్తాన్ విజయానికి గట్టి పునాది వేసిన బెన్ స్టోక్స్‌ను సూపర్‌మేన్‌గా, శామ్సన్‌ను మార్వెల్ సిరీస్‌లోని డాక్టర్ స్ట్రేంజ్‌గా, ఇక ఆర్చర్‌ను గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్టోక్స్, శామ్సన్‌లు బ్యాటింగ్‌లో మెరిస్తే.. ఆర్చర్ స్వింగ్‌లో ఉన్న గేల్ వికెట్‌ను తీసుకున్నాడు. అంతేకాదు ఈ సీజన్‌లో 19 వికెట్లతో రబడ తర్వాత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Tricks & Treats! 🙌#Halloween with the Royals. 🎃#HallaBol | #RoyalsFamily | #HappyHalloween pic.twitter.com/Nwju9AaJAv
— Rajasthan Royals (@rajasthanroyals) October 31, 2020
Comments
Please login to add a commentAdd a comment