షార్జా : కేరళకు చెందిన 43 ఏళ్ల డ్రైవర్‌కు అబుదాబిలో అదృష్టం వరించింది. ఓ మాల్‌లో నిర్వహించిన రాఫెల్ డ్రాలో కేరళ వాసి అబ్దుల్ సలాం షనవాస్‌కు ఏకంగా 2,72,260 డాలర్లు అంటే దాదాపు రూ 2.6 కోట్ల జాక్‌పాట్ తగిలింది. 1997లో తిరువనంతపురం నుంచి ఖాళీ చేతులతో కేరళ వచ్చానని, మరో 50 ఏళ్లు కష్టపడినా ఇంత సొమ్ము తనకు లభించదని షనవాస్ చెప్పుకొచ్చారు. డ్రైవర్‌గా పాతికేళ్ల నుంచి పనిచేస్తున్నా ఎక్కువ డబ్బు దాచలేకపోయానని, అబుదాబికి వచ్చిన తర్వాత నెలకు రూ 49,200 ఆర్జిస్తున్నానని అన్నారు.
ఈ డ్రాలో ఎంట్రీ ఇచ్చేందుకు తాను 54 డాలర్లు వెచ్చించానని, తనను లాటరీ వరించిన విషయం ఎవరికీ చెప్పలేదని, తన భార్యకు మాత్రం భారీ సర్‌ప్రైజ్ ఎదురుచూస్తోందని చెప్పానని ఖలీజ్ టైమ్స్‌తో వెల్లడించారు. ఇక లాటరీ విజేతగా ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నానని..డ్రాలో నమోదైన తర్వాత తనకు వచ్చిన మొబైల్ మెసేజ్‌ను తాను డిలీట్ చేశానని, ఎస్‌ఎంఎస్ కనిపించకపోవడంతో గుండె ఆగినంత పనైందని, ఫోన్ నెంబర్ ఇతర వివరాలను సరిపోల్చుకున్న తర్వాత లాటరీ విజేతగా నిర్వాహకులు నిర్ధారించారని చెప్పారు. లాటరీ ద్వారా వచ్చే డబ్బుతో ఇటీవల తాను కొనుగోలు చేసిన స్ధలంలో మంచి ఇల్లు కట్టుకుంటామని షనవాస్ తన ప్రణాళికలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment