
అబుదాబి ఎయిర్‌పోర్టు దాడి ఘటనపై యూఏఈ ప్రభుత్వం స్పందించింది. ‘సాటి మనుషుల ప్రాణాలు తీయడం పాపం. ఇలాంటి పాపపు పని చేసిన వారు శిక్ష తప్పించుకోలేరు’ అంటూ యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ అన్నారు. తీవ్రవాదులు తమ లక్ష్యం చేరుకునే క్రమంలో అక్రమంగా ఆయుధాలు వాడుతూ సౌదీ గడ్డపై రక్తం చిందిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. జనావాసాలు, ప్రజా సౌకర్యాలపై దాడులు చేస్తున్నారంటూ టెర్రిస్టుల చర్యను ఖండించారు.
యెమెన్ హౌతీ రెబల్ టెర్రరిస్టులు చేసిన డ్రోన్ దాడిలో చనిపోయిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు పూర్తి సహకారం అందిస్తామని యూఏఈ తెలిపింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తగు ఏర్పాట్లు చేస్తోంది.
وزير خارجية دولة الإمارات: ندين استهداف ميليشيا الحوثي الإرهابية لمناطق ومنشآت مدنية في الدولة اليوم.https://t.co/XLhlzxXARh
— وزارة الخارجية والتعاون الدولي (@MoFAICUAE) January 17, 2022
చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి ఇద్దరు భారతీయుల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment