IWF: అబుదాబిలో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే - ఫోటోలు | A grand finale event in Abu Dhabi | Sakshi
Sakshi News home page

IWF: అబుదాబిలో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే - ఫోటోలు

Published Tue, May 9 2023 9:19 PM | Last Updated on Tue, May 9 2023 9:20 PM

A grand finale event in Abu Dhabi - Sakshi

ఇండియా సోషల్ సెంటర్ (ISC ) అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ఆ సంఘం మహిళా విభాగం 'ఇండియన్ ఉమెన్ ఫోరమ్' (IWF) మహిళా సాధికారత సధించే విషయంలో ముందంజలో ఉంది. 

సంవత్సరాంతం IWF సంస్థ మహిళలే ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. IWF వారు 2022 - 2023 సంవత్సరం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ISC ముఖ్య ప్రాంగణంలో గత శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయానికి చెందిన డీసీఎం భార్య జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఇండియా సోషల్ సంటర్ యాజమాన్యం కూడా ఇతర అతిథిలుగా రావడం విశేషం. 

ఈ కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులు ఎంతో ఉత్సాహంతో భారతీయత ఉట్టిపడేలా కథక్, భరత నాట్యం , కూచిపూడి ప్రదర్శించారు. అంతే కాకుండా మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన 'యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్'తో చేసిన 29 రాష్ట్రాల వేషధారణ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని కార్య నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప, దీప తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెప్రెజెంట్ చేస్తూ వచ్చిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బ్రతుకమ్మ విశేష ఆకర్షణగా నిలిచాయి. 2022-23 సంవత్సరం IWF కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించినందుకు ముఖ్య కార్యకర్తలకు ముఖ్య అతిధి జాహ్నవి జ్ఞాపికలను అందించారు. అంతే కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కరికి యాజమాన్యం బహుమతులు అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement