IWF
-
IWF: అబుదాబిలో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే - ఫోటోలు
ఇండియా సోషల్ సెంటర్ (ISC ) అబుదాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. ఆ సంఘం మహిళా విభాగం 'ఇండియన్ ఉమెన్ ఫోరమ్' (IWF) మహిళా సాధికారత సధించే విషయంలో ముందంజలో ఉంది. సంవత్సరాంతం IWF సంస్థ మహిళలే ప్రాధాన్యతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. IWF వారు 2022 - 2023 సంవత్సరం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ISC ముఖ్య ప్రాంగణంలో గత శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయానికి చెందిన డీసీఎం భార్య జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఇండియా సోషల్ సంటర్ యాజమాన్యం కూడా ఇతర అతిథిలుగా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులు ఎంతో ఉత్సాహంతో భారతీయత ఉట్టిపడేలా కథక్, భరత నాట్యం , కూచిపూడి ప్రదర్శించారు. అంతే కాకుండా మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన 'యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్'తో చేసిన 29 రాష్ట్రాల వేషధారణ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని కార్య నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప, దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెప్రెజెంట్ చేస్తూ వచ్చిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనం, బ్రతుకమ్మ విశేష ఆకర్షణగా నిలిచాయి. 2022-23 సంవత్సరం IWF కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించినందుకు ముఖ్య కార్యకర్తలకు ముఖ్య అతిధి జాహ్నవి జ్ఞాపికలను అందించారు. అంతే కాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కరికి యాజమాన్యం బహుమతులు అందించింది. -
World Youth Weightlifting Championship: భళా గురు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు తేజం మెరిసింది. ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు శనపతి గురునాయుడు పసిడి పతకంతో అదరగొట్టాడు. గురునాయుడు ప్రతిభతో ఈ టోర్నీలో భారత్‌కు బంగారు పతకాల బోణీ లభించింది. మెక్సికోలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురునాయుడు బాలుర 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 230 కేజీలతో గురునాయుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియా లిఫ్టర్ మాజీద్ అలీ (229 కేజీలు; స్నాచ్‌లో 105+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) రజతం... కజకిస్తాన్ లిఫ్టర్ యెరాసిల్ ఉమ్రోవ్ (224 కేజీలు; స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 124) కాంస్యం సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ నాలుగు పతకాలు సాధించింది. బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య కాంస్యం గెలిచింది. సౌమ్య స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 148 కేజీలతో మూడో స్థానంలో నిలి చింది. ఆకాంక్ష (40 కేజీలు), విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ‘లిఫ్ట్’ చేస్తే పతకమే... వేదిక ఏదైనా బరిలోకి దిగితే గురునాయుడు పతకంతోనే తిరిగొస్తున్నాడు. తాష్కెం ట్లో జరిగిన 2020 ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో గురు 49 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 2019లో తాష్కెంట్‌లోనే జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో రజతం గెలిచాడు. గత మూడేళ్లుగా జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గురు పసిడి పతకాల పంట పండిస్తున్నాడు. 2020లో బుద్ధగయలో జాతీయ పోటీల్లో అతను స్వర్ణం సాధించడంతోపాటు ఐదు రికార్డులు నెలకొల్పాడు. 2021లో పంజాబ్‌లో, ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గురునాయుడు బంగారు పతకాలు గెలిచాడు. ‘ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడం, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచి ఐఏఎస్ అధికారి కావడం తన జీవిత లక్ష్యాలు’ అని సోమవారం మెక్సికో నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ గురునాయుడు పేర్కొన్నాడు. తండ్రి కలను నిజం చేస్తూ... గురునాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట. అతని తండ్రి రామస్వామి గ్రామీణ క్రీడల్లో రాణించేవారు. ఆ రోజుల్లోనే బాడీబిల్డర్‌గా, వెయిట్‌లిఫ్టర్‌గా పేరుపొందారు. పేదరికం వల్ల తన అభిరుచికి మధ్యలోనే స్వస్తి పలకాల్సి వచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన గురునాయుడిని మాత్రం వెయిట్‌లిఫ్టర్‌గా చేయాలని తపించారు. తన ఆశయాన్ని తన కుమారుడి ద్వారా సాధించాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన చల్లా రాము వద్ద శిక్షణకు పంపించారు. అలా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు దిద్దిన గురునాయుడు సికింద్రాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్మీ స్కూల్లో సీటు సాధించాడు. సీబీఎస్ఈ పదో తరగతిలో ‘ఎ’ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతూ కోచ్ దేవా వద్ద శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు గురునాయుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులైన రామస్వామి, పాపయ్యమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
డబుల్ ధమాకా..భారత్ ఖాతాలో రెండు పతకాలు..!
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. తొలి రోజు మహిళల 45 కేజీల విభాగంలో హర్షద శరద్ గరుడ్ స్వర్ణ పతకం నెగ్గగా... రెండో రోజు మహిళల 49 కేజీల విభాగంలోజ్ఞానేశ్వరి యాదవ్ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. గ్రీస్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్ అండ్ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. 18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్ అండ్ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్‌లో 83+క్లీన్ అండ్ జెర్క్‌లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్‌ను ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగకుండా అంతర్జా తీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిషేధం విధించింది. గత జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రష్యా ఏకంగా తొమ్మిది పతకాలు సాధించింది. -
సంజిత చాను డోపీ కాదు
న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను డోపీ కాదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది. అమె నమూనాల్లో కచ్చితమైన ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లేకపోవడంతో ఐడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు సంజితపై మోపిన డోపింగ్ కేసును కొట్టివేస్తున్నాం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఈ–మెయిల్లో తెలిపింది. 26 ఏళ్ల మణిపూర్ లిఫ్టర్ 53 కేజీల కేటగిరీలో 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలుపొందింది. అయితే 2017 నవంబర్‌లో అమెరికాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు ఆమె నుంచి నమూనాలు సేకరించారు. సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆమెపై 2018 మేలో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆమె నిర్దోషినంటూ మొదటి నుంచి వాదిస్తూనే వచ్చింది. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్న చాను తను ఇన్నాళ్లు పడిన మానసిక క్షోభకు ఐడబ్ల్యూఎఫ్ క్షమాపణలు చెప్పాలని, నష్ట పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేసింది. వారి నిర్వాకం వల్ల తను టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలకు దూరమయ్యానని, దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారని ఆమె ఘాటుగా స్పందించింది. -
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
న్యూఢిల్లీ: కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్ కుక్ అమెరికాకు, గ్రీకో రోమన్ కోచ్ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. -
థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై వేటు
బుడాపెస్ట్: నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) వేటు వేసింది. దాంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. గత బుధవారం నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
అవును.. ఆ 21 మంది డోపింగ్‌కు పాల్పడ్డారు
వర్తమాన క్రీడారంగంలో భారీ డోపింగ్ కుంభకోణమిది! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21 మంది వెయిట్ లిఫ్టర్లు డోపింగ్ టెస్టులో దోషులుగా తేలారు. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ గతంలోనే వీరిని సస్పండ్ చేసింది. 'బి శాంపిల్ టెస్ట్'లోనూ ఇదే ఫలితం వెల్లడయితే గనుక 21 మంది వెయిట్ లిఫ్టర్లు ఏకంగా నాలుగేళ్లపాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. లిఫ్టర్లు డోపింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని, అయితే మరో పరీక్ష అనంతరం క్రీడాకారుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 2006 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా రాణి, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన సిమ్రన్ ప్రీత్ కౌర్, అమృతపాల్ సింగ్, అక్షర్‌దీప్ కౌర్, హర్జీత్ కౌర్, మగ్తే కోమ్, కోమల్ వాకలే తదితరులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడినవారిలో ఉన్నారు.