వర్తమాన క్రీడారంగంలో భారీ డోపింగ్ కుంభకోణమిది! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21 మంది వెయిట్ లిఫ్టర్లు డోపింగ్ టెస్టులో దోషులుగా తేలారు. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ గతంలోనే వీరిని సస్పండ్ చేసింది. 'బి శాంపిల్ టెస్ట్'లోనూ ఇదే ఫలితం వెల్లడయితే గనుక 21 మంది వెయిట్ లిఫ్టర్లు ఏకంగా నాలుగేళ్లపాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
లిఫ్టర్లు డోపింగ్కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని, అయితే మరో పరీక్ష అనంతరం క్రీడాకారుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 2006 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా రాణి, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన సిమ్రన్ ప్రీత్ కౌర్, అమృతపాల్ సింగ్, అక్షర్దీప్ కౌర్, హర్జీత్ కౌర్, మగ్తే కోమ్, కోమల్ వాకలే తదితరులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడినవారిలో ఉన్నారు.
అవును.. ఆ 21 మంది డోపింగ్కు పాల్పడ్డారు
Published Sat, Apr 4 2015 6:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement