అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA).. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం వాటా కోసం రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉన్న 'రిలయన్స్ రిటైల్' సంస్థ ఇషా అంబానీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ ద్వారా వేగంగా డెవలప్ అవుతోంది.
కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ రిటైల్ కంపెనీ కింద ఏకంగా 18,500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నట్లు.. దీని ద్వారా సుమారు 26.7 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో భాగస్వామి అయిన అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA)కి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని, ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ, మా వ్యాపార ప్రాథమిక అంశాలు, వ్యూహం, అమలు సామర్థ్యాలపై మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఇషా అంబానీ అన్నారు. రానున్న రోజుల్లో రిటైల్ రంగంలో మార్పులు వేగవంతంగా పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
ఇక ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షాహ్వాన్ అల్ధహేరి మాట్లాడుతూ.. రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందని, ఈ పెట్టుబడి సంస్థలో ప్రత్యేక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ డీల్ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment