బహ్రెయిన్ గ్రాండ్ ప్రి సొంతం
బహ్రెయిన్: వరుసగా గత మూడు సీజన్ల పాటు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ కొత్త సీజన్‌ను మళ్లీ అదే జోరుతో మొదలు పెట్టాడు. 2024లో తొలి ఎఫ్1 రేస్ అయిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. సమీప ప్రత్యర్థికంటే ఏకంగా 22.457 సెకన్ల తేడాతో రేస్‌ను ముగించడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. శనివారం జరిగిన రేస్‌ను వెర్‌స్టాపెన్ 1 గంటా 31 నిమిషాల 44.472 సెకన్లలో పూర్తి చేశాడు.
రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్ రెండో స్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్‌కి మూడో స్థానం దక్కింది. స్టార్ మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెర్‌స్టాపెన్ అంచనాలను అందుకున్నాడు. 57 ల్యాప్‌లు అన్నింటిలో ముందంజలో నిలిచిన అతను తన కెరీర్‌లో 55వ విజయాన్ని అందుకున్నాడు. సీజన్‌లో రెండో రేసు ఈ నెల 9న సౌదీ అరేబియాలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment