Advertisement
Brazilian Grand Prix title
-
వెర్‌స్టాపెన్‌కు 17వ విజయం
సావ్‌పాలో (బ్రెజిల్): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 17వ విజయాన్ని నమోదు చేశాడు. సీజన్‌లోని 20వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన అతను చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంట 56 నిమిషాల 48.894 సెకన్లలో రేసును ముగించి టైటిల్ దక్కించుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో 14 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 22 రేసులు ఉండగా.. ఇప్పటికి 20 రేసులు ముగిశాయి. 17 రేసుల్లో వెర్స్టాపెన్ నెగ్గగా... రెండు రేసుల్లో సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), ఒక రేసులో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) గెలిచారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. -
రోస్‌బర్గ్‌దే విజయం
* బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * హామిల్టన్‌కు రెండో స్థానం సావోపాలో: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్బర్గ్ను మొదటి ల్యాప్‌లో సహచరుడు లూయిస్ హామిల్టన్ ఓవర్టేక్ చేయబోయినా... రోస్‌బర్గ్ చాకచక్యంగా డ్రైవ్ చేసి ముందుకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఐదో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను ఖరారు చేసుకున్న హామిల్టన్ రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మాజీ చాంపియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంలో నిలిచాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (363 పాయింట్లు), రోస్‌బర్గ్ (297), వెటెల్ (266) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఫలితాలు: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. గ్రోస్యెన్ (లోటస్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. మల్డొనాడో (లోటస్), 11. రికియార్డో (రెడ్‌బుల్), 12. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 13. నాసర్ (సాబెర్), 14. బటన్ (మెక్లారెన్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. స్టీవెన్స్ (మనోర్), 18. రోసీ (మనోర్).