దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకెల్ షుమాకర్ కుమారుడు మిక్ షుమాకర్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జెడ్డా స్ట్రీట్ సర్య్కూట్‌లో రేసు జరిగింది. ఈ రేసులో హాస్ తరపున మిక్ షుమాకర్ పాల్గొన్నాడు. టర్న్ 12లో ఒక్కసారిగా కార్ కంట్రోల్ కాకపోవడంతో ల్యాప్‌పై నుంచి కారు రాసుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో కారు వేగం దాదాపు 240 కిమీ వేగంతో ఉంది.
దీంతో ల్యాప్స్ పక్కన ఉన్న సైడ్‌బార్‌కు కార్ క్రాష్ కావడం.. ముక్కలు కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికి మిక్ షుమాకర్ అదృష్టం కొద్ది చిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కాగా టోర్నీ నిర్వాహకులు వెంటనే మిక్ షుమాకర్‌ను ట్రాక్‌సైడ్ మెడికల్‌సెంటర్‌కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత జెడ్డాలోని కింగ్ ఫర్హాద్ అహ్మద్ ఫోర్సెస్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదివారం రాత్రి జరగనున్న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ రేసుకు మిక్ షుమాకర్ దూరమయ్యాడు. షుమాకర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: WTA Rankings: నంబర్‌వన్‌గా స్వియాటెక్
Mick Schumacher will miss the Saudi Arabian GP after a huge accident in qualifying.
— Formula 1 (@F1) March 26, 2022
That Mick is physically well after the crash is another reminder of the strength and safety of modern F1 cars for which we are incredibly thankful#SaudiArabianGP #F1 pic.twitter.com/qhLcw0elb7
Comments
Please login to add a commentAdd a comment