
జెద్దా: ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ 2022 సీజన్‌లో తొలి విజయం నమోదు చేశాడు. సీజన్ రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టుకు చెందిన 24 ఏళ్ల వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 50 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 19.293 సెకన్లలో పూర్తి చేసి తన కెరీర్‌లో 21వ విజయాన్ని అందుకున్నాడు.
ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ రెండో స్థానంలో నిలువగా ... కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) నాలుగో స్థానంతో సంతృప్తి పడ్డాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 10న జరుగుతుంది.
Racing one-handed...
— Formula 1 (@F1) March 28, 2022
🤷♀️ Just @Max33Verstappen things 🤷♂️#SaudiArabianGP #F1 pic.twitter.com/GrGaNaztVx