Mick Schumacher
-
భయంకరమైన యాక్సిడెంట్.. తృటిలో తప్పించుకున్న ఫార్ములావన్ రేసర్
దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకెల్ షుమాకర్ కుమారుడు మిక్ షుమాకర్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జెడ్డా స్ట్రీట్ సర్య్కూట్లో రేసు జరిగింది. ఈ రేసులో హాస్ తరపున మిక్ షుమాకర్ పాల్గొన్నాడు. టర్న్ 12లో ఒక్కసారిగా కార్ కంట్రోల్ కాకపోవడంతో ల్యాప్‌పై నుంచి కారు రాసుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో కారు వేగం దాదాపు 240 కిమీ వేగంతో ఉంది. దీంతో ల్యాప్స్ పక్కన ఉన్న సైడ్బార్కు కార్ క్రాష్ కావడం.. ముక్కలు కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికి మిక్ షుమాకర్ అదృష్టం కొద్ది చిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కాగా టోర్నీ నిర్వాహకులు వెంటనే మిక్ షుమాకర్‌ను ట్రాక్‌సైడ్ మెడికల్సెంటర్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత జెడ్డాలోని కింగ్ ఫర్హాద్ అహ్మద్ ఫోర్సెస్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదివారం రాత్రి జరగనున్న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ రేసుకు మిక్ షుమాకర్ దూరమయ్యాడు. షుమాకర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: WTA Rankings: నంబర్‌వన్‌గా స్వియాటెక్ Mick Schumacher will miss the Saudi Arabian GP after a huge accident in qualifying. That Mick is physically well after the crash is another reminder of the strength and safety of modern F1 cars for which we are incredibly thankful#SaudiArabianGP #F1 pic.twitter.com/qhLcw0elb7 — Formula 1 (@F1) March 26, 2022 -
ఫార్ములా–2 చాంపియన్ మిక్ షుమాకర్
సాఖిర్ (బహ్రెయిన్): వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) లో అరంగేట్రం చేయనున్న దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా–2 చాంపియన్ షిప్లో 21 ఏళ్ల మిక్ ఓవరాల్ చాంపియన్‌గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున పోటీపడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది మిక్ ఫార్ములావన్‌లో అమెరికాకు చెందిన హాస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. జిహాన్ దారూవాలాకు తొలి ఎఫ్2 టైటిల్... భారత్‌కు చెందిన రేసర్ జిహాన్ దారూవాలా తన కెరీర్లో తొలిసారి ఎఫ్2 రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ ఎఫ్2 రేసులో 22 ఏళ్ల జిహాన్ స్ప్రింట్ రేసు విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన కార్లిన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిహాన్ 34 ల్యాప్‌ల స్ప్రింట్ రేసును 37 నిమిషాల 26.570 సెకన్లలో ముగించి తొలి స్థానాన్ని పొందాడు. ముంబైకి చెందిన జిహాన్ ఎఫ్2 సీజన్లో 72 పాయింట్లు స్కోరు చేసి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. జిహాన్–యుకీ సొనోడా సభ్యులుగా ఉన్న కార్లిన్ జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందడం విశేషం. -
రేసులో వారసుడొచ్చాడు...
దిగ్గజాల్లాంటి తండ్రి అడుగు జాడల్లో కొడుకులు నడవటం కొత్త కాదు. డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్, క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావడం చూసేశాం. ఇప్పుడు రేసర్ తనయుడు రేసర్‌గా వారసత్వం నిలబెట్టేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఎఫ్1 ప్రపంచాన్ని శాసించి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ డ్రైవర్ మైకేల్ షుమాకర్ కొడుకు మిక్ షుమాకర్ ఎఫ్1 లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. స్కీయింగ్ చేస్తూ గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమైన తండ్రి ఆశలకు కొత్త ఊపిరి పోసేందుకు 16 ఏళ్ల మిక్ సన్నద్ధమయ్యాడు. శనివారం ప్రారంభమైన యూరోపియన్ ఏడీఏసీ ఫార్ములా-4 పోటీల్లో నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ అమర్స్ఫూర్ట్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. యూరోపియన్ కార్టింగ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి అతను ఈ రేస్‌లకు అర్హత సాధించాడు. చాన్నాళ్లుగా మిక్ షుమాకర్ రేసింగ్ పోటీల్లో కనిపిస్తున్నా... తన తండ్రి పేరు ఎక్కడా తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. కార్టింగ్‌లో అతను తల్లి పేరు కొరిన్నా జత చేసి బరిలోకి దిగేవాడు. ఇప్పుడు ఇది బయటపడటంతో అతనిపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. వారసుల విజయాలు, వైఫల్యాలు సంగతి ఎలా ఉన్నా... తండ్రి పేరు భారం మోస్తూ అంచనాల మధ్య సత్తా చాటడం అంత సులువు కాదు. అయితే రేసింగ్ ప్రపంచం మొత్తం మిక్కు అండగా నిలుస్తోంది. అతనిలో అపార ప్రతిభ ఉందని, కచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టగలడని మాజీ డ్రైవర్లు, ఎఫ్1 దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఈ కుర్రాడు భవిష్యత్తులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.