సాఖిర్ (బహ్రెయిన్): వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) లో అరంగేట్రం చేయనున్న దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా–2 చాంపియన్ షిప్‌లో 21 ఏళ్ల మిక్ ఓవరాల్ చాంపియన్‌గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్‌లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున పోటీపడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది మిక్ ఫార్ములావన్‌లో అమెరికాకు చెందిన హాస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
జిహాన్ దారూవాలాకు తొలి ఎఫ్2 టైటిల్...
భారత్‌కు చెందిన రేసర్ జిహాన్ దారూవాలా తన కెరీర్‌లో తొలిసారి ఎఫ్2 రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ ఎఫ్2 రేసులో 22 ఏళ్ల జిహాన్ స్ప్రింట్ రేసు విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన కార్లిన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిహాన్ 34 ల్యాప్‌ల స్ప్రింట్ రేసును 37 నిమిషాల 26.570 సెకన్లలో ముగించి తొలి స్థానాన్ని పొందాడు. ముంబైకి చెందిన జిహాన్ ఎఫ్2 సీజన్‌లో 72 పాయింట్లు స్కోరు చేసి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. జిహాన్–యుకీ సొనోడా సభ్యులుగా ఉన్న కార్లిన్ జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందడం విశేషం.
ఫార్ములా–2 చాంపియన్ మిక్ షుమాకర్
Published Mon, Dec 7 2020 5:19 AM | Last Updated on Mon, Dec 7 2020 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment