
ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఎవరిదో తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్‌లో వెర్‌స్టాపెన్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.109 సెకన్లలో పూర్తి చేసి పోల్‌పొజిషన్‌ను అందుకున్నాడు.
చాంపియన్‌షిప్ కోసం పోటీ పడుతున్న హామిల్టన్ (మెర్సిడెస్) క్వాలిఫయింగ్ సెషన్‌లో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ప్రస్తుతం 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. నేటి రేసులో ఈ ఇద్దరిలో ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి టైటిల్ లభిస్తుంది. నేటి సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్‌స్టార్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment