grandpre tournment
-
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
సింగపూర్: రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో పెరెజ్ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ అందరికంటే వేగంగా 2గం:02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లెక్లెర్క్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో 11 విజయాలు సాధించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. -
అబుదాబి గ్రాండ్‌ప్రి... వెర్‌స్టాపెన్‌దే పోల్ పొజిషన్
ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఎవరిదో తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్లో వెర్స్టాపెన్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.109 సెకన్లలో పూర్తి చేసి పోల్పొజిషన్ను అందుకున్నాడు. చాంపియన్‌షిప్ కోసం పోటీ పడుతున్న హామిల్టన్ (మెర్సిడెస్) క్వాలిఫయింగ్ సెషన్లో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ప్రస్తుతం 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. నేటి రేసులో ఈ ఇద్దరిలో ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి టైటిల్ లభిస్తుంది. నేటి సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. -
‘క్వీన్’ హంపి
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. సోమవారం ముగిసిన ‘ఫిడే’ తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో హంపి విజేతగా నిలిచింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆమె 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మాయి ఆరు గేముల్లో గెలిచి... నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... మిగతా ఒక గేమ్‌లో ఓడిపోయింది. గత జూన్‌లో అర్మేనియాలోని దిలిజాన్లో జరిగిన గ్రాండ్‌ప్రి టోర్నీలోనూ హంపి చాంపియన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. పదో రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న హారిక చివరి రౌండ్లో జావో జుయ్ (చైనా) చేతిలో 38 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆరున్నర పాయింట్లతో హారిక, జావో జుయ్ ఉమ్మడిగా మూడో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా జావో జుయ్ నాలుగో స్థానాన్ని, హారిక ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు చివరి రౌండ్లో విజయాలతో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా), కాటరీనా (ఉక్రెయిన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బేలాకు రెండో స్థానం... కాటరీనాకు మూడో స్థానం లభించాయి. 2013-14 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా మొత్తం ఆరు టోర్నీలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ ఏడాది మూడు టోర్నీలు ముగిశాయి. మిగతా మూడు టోర్నీలు వచ్చే ఏడాదిలో జరుగుతాయి. ఈ గ్రాండ్ ప్రి సిరీస్ ఓవరాల్ విజేత 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తారు.