
ఫార్ములా వన్ సీజన్‌లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు రేసర్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకెన్లలో ముగించి టైటిల్ సాధించాడు.
పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment