Redbull team
-
బ్రేక్ ముగిసింది... స్టీరింగ్ పిలుస్తోంది
ఫార్ములావన్ సీజన్లో వరుసగా ఐదు నెలలపాటు ట్రాక్‌పై రయ్..రయ్..రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లకు గత 26 రోజులుగా విరామం లభించింది. విరామం ముగియడంతో మళ్లీ ట్రాక్‌పైకి రావడానికి కార్లు, డ్రైవర్లు సిద్ధమయ్యారు. మొత్తం 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 14 రేసులు ముగిశాయి. 15వ రేసుకు నెదర్లాండ్స్‌లోని జాండ్వర్ట్ సర్క్యూట్ ముస్తాబయింది. శుక్రవారం డ్రైవర్లందరూ ప్రాక్టీస్ చేశారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. సీజన్‌లోని తొలి అర్ధభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఆధిపత్యం చలాయించి ఏడు రేసుల్లో గెలిచాడు. రెండో భాగంలో మిగిలిన పది రేసుల్లో ఇతర జట్ల డ్రైవర్లు గేర్ మార్చి వెర్స్టాపెన్ దూకుడుకు బ్రేక్‌లు వేస్తారా లేదా వేచి చూడాలి. జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): గత మూడేళ్లుగా సొంతగడ్డపై రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, నెదర్లాండ్స్ స్టార్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఎదురులేదు. స్వదేశంలో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న వెర్స్టాపెన్ వరుసగా నాలుగోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో ఈసారీ గెలిచి అత్యధికసార్లు ఈ రేసు నెగ్గిన జిమ్ క్లార్క్ సరసన చేరాలని వెర్స్టాపెన్ భావిస్తున్నాడు. జిమ్ క్లార్క్ 1963, 1964, 1965, 1967లో డచ్ గ్రాండ్‌ప్రి చాంపియన్‌గా నిలవగా.. వెర్స్టాపెన్ 2021 నుంచి 2023 వరకు మూడేళ్ల పాటు వరుసగా విజయాలు సాధించాడు. గత మూడు రేసుల్లోనూ ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసు ప్రారంభించిన 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్లో 200వ రేసు కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింటిలో నెగ్గిన వెర్స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ (మెక్లారెన్) 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) 177 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ రేసర్ లూయిస్ హామిల్టన్ 150 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వెర్స్టాపెన్ అత్యధికంగా తొమ్మిదిసార్లు పోడియంపై (టాప్–3) నిలవగా... నోరిస్ ఎనిమిదిసార్లు ఆ ఘనత సాధించాడు. ట్రాక్ ఎలా ఉందంటే! ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి అయిన జాండ్వర్ట్లో ఈ రేసు జరగనుంది. సముద్ర తీరానికి అతి సమీపంలోని రిసార్ట్‌లోని అహ్లాదకర వాతావరణం అటు అభిమానులను, ఇటు రేసర్లను మరింత ఉత్సాహపరచనుంది. అనూహ్య మలుపులు, ఊహించని ఎత్తుపల్లాలతో డ్రైవర్లకు ఈ ట్రాక్ సవాలు విసరనుంది. 72 ల్యాప్‌లు.. డచ్ గ్రాండ్‌ప్రి సర్క్యూట్లో మొత్తం 72 ల్యాప్‌లు ఉన్నాయి. అందులో ఒక్కో ల్యాప్ 4.2 కిలోమీటర్లు కాగా... పూర్తి రేసు దూరం 307 కిలోమీటర్లు.రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) కెరీర్లో ఇది 200వ రేసు. ఫార్ములావన్ చరిత్రలో 200 రేసులు పూర్తి చేసుకోనున్న 23వ డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందనున్నాడు. 392 రేసులతో ఫెర్నాండో అలోన్సో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్‌దే రికార్డు డచ్ గ్రాండ్‌ప్రిలో అత్యంత వేగంగా ల్యాప్ పూర్తి చేసిన రికార్డు బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పేరిట ఉంది. 2021 రేసులో భాగంగా హామిల్టన్ 1 నిమిషం 11.097 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.సొంతగడ్డపై పోటీ పడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత ఏడాది ఇక్కడ పోటీ పడ్డప్పుడు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజేతగా నిలిచా. ఈ సారి ఇంకా ఎక్కువ పోటీ ఉండనుంది. మరింత మెరుగయ్యేందుకు ప్రయతి్నస్తా. –వెర్స్టాపెన్, రెడ్‌బుల్ డ్రైవర్ నేటి క్వాలిఫయింగ్ సెషన్ సాయంత్రం గం. 6:30 నుంచి ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఛాంప్ వెర్స్టాపెన్
ఫార్ములా వన్ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు రేసర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకెన్లలో ముగించి టైటిల్ సాధించాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్ పొజిషన్’
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఐదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సుజుకా నగరంలో శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 29.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. లెక్లెర్క్ (ఫెరారీ), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఇప్పటివరకు 17 రేసులు జరగ్గా... 11 రేసుల్లో వెర్స్టాపెన్ గెలిచి 341 పాయింట్లతో టాప్‌ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. లెక్లెర్క్ 237 పాయింట్లతో రెండో స్థానంలో, పెరెజ్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. -
వెటెల్ కొత్త చరిత్ర
ఆస్టిన్: మరో రేసు... మరో విజయం... మరో రికార్డు... మూడు వారాల క్రితమే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు స్టార్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నామమాత్రమైన రేసుల్లోనూ దుమ్ము రేపుతున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునెటైడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 39 నిమిషాల 17.148 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు. అంతేకాకుండా ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా చరిత్ర సృష్టించాడు. దాంతో ఇప్పటిదాకా ఒకే సీజన్లో వరుసగా ఏడు విజయాలతో ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ (జర్మనీ-2004లో) పేరిట ఉన్న రికార్డును వెటెల్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో వెటెల్‌కిది 12వ విజయం కాగా... కెరీర్లో 38వ టైటిల్ కావడం విశేషం. ఈనెల 24న సీజన్‌లోని చివరిదైన రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ గెలిస్తే మరో రెండు ప్రపంచ రికార్డులను సమం చేస్తాడు. ఎఫ్1 చరిత్రలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక డ్రైవర్ అల్బెర్టో అస్కారి (ఇటలీ) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అల్బెర్టో అస్కారి 1952 సీజన్‌లోని చివరి ఆరు రేసుల్లో... 1953 సీజన్ ఆరంభంలోని తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఒకే సీజన్లో అత్యధికంగా 13 విజయాలతో మైకేల్ షుమాకర్ (2004లో) పేరిట ఉన్న రికార్డునూ వెటెల్ సమం చేస్తాడు. ఫోర్స్ ఇండియాకు నిరాశ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. తొలి ల్యాప్‌లోనే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సుటిల్ కారుపై నియంత్రణ కోల్పోయి విలియమ్స్ జట్టు డ్రైవర్ పాస్టర్ మల్డొనాడో కారును ఢీకొట్టాడు. దాంతో సర్క్యూట్‌పై సేఫ్టీ కారు రంగప్రవేశం చేసింది. ఐదో ల్యాప్ మొదలయ్యే సమయానికి వెటెల్ ఆధిక్యం 1.9 సెకన్లకు చేరుకుంది. ఆ తర్వాత వెటెల్ వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా వెటెల్ ఆరు సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. గ్రోస్యెన్ (లోటస్) రెండో స్థానంలో... వెబెర్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఐదో స్థానం పొందిన ఫెరారీ జట్టు డ్రైవర్ అలోన్సో ఓవరాల్‌గా 227 పాయింట్లతో ఈ సీజన్‌లోని డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘ఫోర్స్’కే చెందిన మరో డ్రైవర్ పాల్ డి రెస్టా 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గర్వంగా ఉంది ‘‘ఒకే సీజన్లో వరుసగా ఎనిమిది రేసులు నెగ్గిన తొలి డ్రైవర్‌గా రికార్డు సృష్టించినందుకు గర్వంగా అనిపిస్తోంది. ఈ విజయాల సంఖ్య కారణంగా నేను కారులో నుంచి ఎగిరి గంతేయను. అయితే తాజా గెలుపుతో నేను ఓ అద్భుతం చేశానని గ్రహించాను. కొన్నేళ్ల తర్వాత మా ఘనతలపై కూడా అభిమానులు చర్చించుకుంటారు. నా రికార్డు వెనుక రెడ్‌బుల్ జట్టు బృందం కృషి ఎంతో ఉంది. వాస్తవానికి షుమాకర్ పేరిట ఉన్న రికార్డును ఎవరూ తిరగరాసే అవకాశం లేదని భావించారు. కానీ మేం దీనిని సాధ్యం చేశాం.’’ -వెటెల్, రెడ్‌బుల్ డ్రైవర్ -
వెటెల్ ‘హ్యాట్రిక్ పోల్’
ప్రధాన రేసు ఉదయం గం. 11.15 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం యోన్గామ్ (దక్షిణ కొరియా): రెండు వారాల క్రితం ‘హ్యాట్రిక్’ విజయాలను నమోదు చేసిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్... క్వాలిఫయింగ్‌లోనూ హ్యాట్రిక్ ఘనత సాధించాడు. శనివారం జరిగిన కొరియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. ఈ జర్మన్ డ్రైవర్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 37.202 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి వరుసగా మూడోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. గత ఏడాది కూడా ఈ రేసులో విజేతగా నిలిచిన ‘హ్యాట్రిక్ వరల్డ్ చాంపియన్’ వెటెల్ ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయంపై దృష్టి పెట్టాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించనున్న వెటెల్ ఒకవేళ విజేతగా నిలిస్తే మాత్రం వరుసగా నాలుగో ఏడాది అతనికే ప్రపంచ టైటిల్ దక్కే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పటికే 247 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న వెటెల్‌కు, రెండో స్థానంలో ఉన్న అలోన్సో (187 పాయింట్లు)కు మధ్య ఏకంగా 60 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వెటెల్ ఖాతాలో మరో విజయం చేరితే ఈ తేడా మరింతగా పెరిగే అవకాశముంది. కొరియా రేసు తర్వాత ఈ సీజన్లో మరో ఐదు రేసులు మిగిలి ఉంటాయి. ఇక భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు కొరియా గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లోనూ నిరాశ మిగిలింది. సుటిల్, పాల్ డి రెస్టా వరుసగా 14వ, 15వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. వెటెల్ సహచరుడు వెబెర్ క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం పొందినా... స్టీవార్డ్ మూడు హెచ్చరికలను ఉల్లంఘించినందుకు అతనిపై 10 గ్రిడ్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా వెబెర్ రేసును 13వ స్థానం నుంచి ఆరంభిస్తాడు.