
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో ఐదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సుజుకా నగరంలో శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 29.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
లెక్‌లెర్క్ (ఫెరారీ), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో ఇప్పటివరకు 17 రేసులు జరగ్గా... 11 రేసుల్లో వెర్‌స్టాపెన్ గెలిచి 341 పాయింట్లతో టాప్‌ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. లెక్‌లెర్క్ 237 పాయింట్లతో రెండో స్థానంలో, పెరెజ్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment