Bahrain Grand Prix race
-
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఛాంప్ వెర్స్టాపెన్
ఫార్ములా వన్ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు రేసర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 33 నిమిషాల 56.736 సెకెన్లలో ముగించి టైటిల్ సాధించాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. -
Bahrain GP Qualifying: ఎఫ్1 సీజన్‌కు వేళాయె...
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్ పొజిషన్‌ను తేల్చేందుకు క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. క్వాలిఫయింగ్ సెషన్లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్ ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’ హోదాలో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో కూడా డిఫెండింగ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్ జట్టు) తన జోరు కొనసాగించే అవకాశముంది. అతనికి హామిల్టన్ (మెర్సిడెస్), లెక్లెర్క్ (ఫెరారీ) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే చాన్స్ ఉంది. మొత్తం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు మొత్తం 23 రేసుల్లో పాల్గొంటారు. -
నిమిషం ఆలస్యమయినా పరిస్థితి వేరుగా ఉండేది
బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌లో భాగంగా ఫార్ములావన్ డ్రైవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాప్ జరుగుతుండగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫార్ములావన్ డ్రైవర్ వెంటనే బయటకు దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. గత ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీ జరిగింది. కుడేరియా ఆల్ఫాతౌరీ డ్రైవర్ పియర్ గ్యాస్లీ రేసులో పాల్గొన్నాడు. మరో 10 ల్యాప్స్ ఉన్న సమయంలో పియర్ గ్యాస్లీ కారుకు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన పియర్ వెంటనే కారును సైడ్‌కు తీసుకెళ్లి అందులో నుంచి బయటకు దూకేశాడు. చూస్తుండగానే మంటలు కారును మొత్తం చుట్టేశాయి. వెంటనే నిర్వహకులు వచ్చి మంటలు ఆర్పేశారు. కాగా పియర్ గ్యాస్లీ 46వ ల్యాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కచ్చితంగా టాప్ 10లో ఉంటానని భావించిన పియర్‌కు ఇది ఊహించని ఫలితం అని చెప్పొచ్చు. ఇక ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Lewis Hamilton: టైటిల్ గెలవకపోయినా ప్రపంచ రికార్డు బద్దలు Ashleigh Barty: టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం.. 25 ఏళ్ల వయస్సులోనే Not the start to the season Pierre Gasly wanted! 💔 An unlucky end to the Frenchman's race with his car coming to a stop on Lap 46 😔#BahrainGP #F1 pic.twitter.com/bai0TUPgMz — Formula 1 (@F1) March 22, 2022 -
టైటిల్ గెలవకపోయినా ప్రపంచ రికార్డు బద్దలు
ఫార్ములావన్‌లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ఎఫ్1 రేసును మూడో స్థానంతో ముగించాడు. టైటిల్ గెలవడంలో విఫలమైనప్పటికి 16 ఏళ్ల తన రికార్డును మాత్రం కాపాడుకున్నాడు. ఎఫ్1 రేసులో హామిల్టన్ పోడియంను మూడో స్థానంతో ముగించాడు. ఒక గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ తన స్థానాన్ని పోడియంతో ముగించడం వరుసగా 16వ ఏడాది కావడం విశేషం. ఇంతకముందు లెజెండరీ ఫార్ములావన్ డ్రైవర్ మైకెల్ షుమాకర్ మాత్రమే ఉన్నాడు. తాజాగా హామిల్టన్ ఆ ఘనత సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు 250 రేసుల్లో పాయింట్లు సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ నిలిచాడు. ఇక క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Indian Wells Final: నాదల్కు ఊహించని షాక్.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్ చేశాడు -
లెక్లెర్క్కు ‘పోల్.. ఐదో స్థానం నుంచి హామిల్టన్
సాఖిర్: ఫార్ములావన్–2022 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి నేడు జరగనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.558 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. -
హ్యాలో కాపాడింది...
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఆదివారం పెను ప్రమాదమే జరిగినా... హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ స్వల్ప గాయాలతో బయటపడటం గొప్ప విశేషం. కారుపై నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. కాక్‌పిట్, చాసిస్ వేరుపడ్డాయి. దీంతో పెట్రోల్ లీకేజితో ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు మంటలు చెలరేగాయి. ఇంతటి ఘోరప్రమాదం జరిగినా గ్రోస్యెన్ ప్రాణం మీదికి రాకపోవడంతో ఫార్ములావన్ (ఎఫ్1), బహ్రెయిన్ వర్గాలకు పెద్ద ఊరటే లభించింది. 34 ఏళ్ల గ్రోస్యెన్‌ను హుటాహుటిన హెలికాప్టర్లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఇది మినహా ఎలాంటి ఫ్రాక్చర్, ప్రాణాపాయ సమస్యలు లేవు. ఇంకా చెప్పాలంటే అంతపెద్ద మంటల్లో... ఫైర్ మార్షల్స్ మంటల్ని అదుపు చేస్తుంటే అతనే ఎంచక్కా బారికేడ్‌ను దూకుతూ దాటాడు. ఇద్దరు సాయమందించినా... తనే నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కాడు. పెను ప్రమాదం నుంచి అతను చిన్న చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అద్భుతమని 1996 ఎఫ్1 చాంపియన్ డామొన్ హిల్ అన్నారు. అదే రక్షించింది... ఫార్ములావన్ ఆధునికతే గ్రోస్యెన్‌కు ఊపిరి పోసింది. కొన్నేళ్లు పరీక్షించిన మీదట డ్రైవర్ల ప్రాణాలను నిలుపుతుందని భావించిన ఎఫ్1 సంస్థ 2018లో రేస్ కార్లలో హ్యాలో సిస్టమ్‌ను అమలు చేసింది. డ్రైవర్ తలకు ఏమాత్రం గాయమవ్వకుండా ఉండే రక్షణ కవచం ఇది. కారు కాక్‌పిట్‌లో ఓ ఫ్రేమ్‌గా తలపై భాగాన్ని కవర్ చేస్తుంది. 2016లో వచ్చిన హ్యాలో సిస్టమ్‌కు లేటెస్ట్ వర్షన్ (ఆధునిక) తోడవడంతో 2017లో ఎఫ్1 సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 17 శాతం ప్రాణాపాయాన్ని తగ్గించగలదని ధ్రువీకరించుకున్న ఎఫ్1 ఆ మరుసటి ఏడాది అధికారికంగా అమల్లో పెట్టింది. కానీ ఆనాడు దీన్ని రొమైన్ గ్రోస్యెన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘హ్యాలో అంటే నాకు అసహ్యం. ఇదేం బాగోలేదు. దీంతో నాకు అస్వస్థత అయిన అనుభవం కలిగింది’ అని స్పందించాడు. కానీ ఇప్పుడదే సంజీవనిగా అతనికి ఉపయోగపడింది. బరిలోకి పియెట్రో... హాస్ టీమ్ డ్రైవర్ గ్రోస్యెన్ తదుపరి రేసుకు దూరమవ్వడంతో హాస్ టీమ్ అతని స్థానాన్ని బ్రెజిల్ రిజర్వ్ డ్రైవర్ పియెట్రో ఫిటిపాల్డికి ఇచ్చింది. దీంతో సాఖిర్లోనే ఈ వారాంతంలో జరిగే రేసుతో పియెట్రో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేయనున్నాడు. పియెట్రో కుటుంబానికి ఎఫ్1తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పియెట్రో తాత ఎమర్సన్ 1972, 1974లో ఎఫ్1 వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. ఎమర్సన్ సోదరుడు విల్సన్... విల్సన్ తనయుడు క్రిస్టియన్ ఫిటిపాల్డి కూడా ఎఫ్1 రేసుల్లో పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం నేను హ్యాలో సిస్టమ్‌ను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడదే నన్ను కాపాడింది. ఇప్పుడు అది లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్నే కాదు. –గ్రోస్యెన్ -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ప్రమాదం
సాఖిర్: ఫార్ములావన్ (ఎఫ్1) బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తొలి ల్యాప్‌లో హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ నియంత్రణ కోల్పోయి ట్రాక్ పక్కనున్న బారికేడ్లను ఢీకొట్టాడు. వెంటనే అతని కారులో మంటలు చెలరేగాయి. కారు కాక్‌పిట్, చాసిస్ వేర్వేరుగా రెండు ముక్కలైపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే గ్రోస్యెన్ సమయస్ఫూర్తితో స్పందించి కారులో నుంచి బయటకు వచ్చి బారికేడ్లను దాటి సురక్షిత ప్రదేశానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న సహాయక బృందం కూడా వేగంగా స్పందించి గ్రోస్యెన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రోస్యెన్ రెండు చేతులకు, మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో రేసును గంటన్నరపాటు నిలిపివేశారు. మంటలను పూర్తిగా ఆపేశాక రేసును కొనసాగించారు. రేసు పునఃప్రారంభమయ్యాక రెండో ల్యాప్‌లోనే రేసింగ్ పాయింట్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రాల్ కారు పల్టీలు కొట్టి ట్రాక్ బయటకు వెళ్లింది. 57 ల్యాప్‌ల ఈ రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లోకి హామిల్టన్‌కిది 11వ విజయం కావడం విశేషం. -
హామిల్టన్... పోల్ @ 98
సాఖిర్ (బహ్రెయిన్): ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గించడం లేదు. ఈ సీజన్లో పదోసారి... కెరీర్లో 98వ సారి ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 34 ఏళ్ల హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 27.264 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే పది రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ 11వ రేసు టైటిల్ వేటలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 6. రికియార్డో (రెనౌ), 7. ఒకాన్ (రెనౌ), 8. గాస్లే (అల్ఫా టౌరి), 9. నోరిస్ (మెక్లారెన్), 10. క్వియాట్ (అల్ఫా టౌరి), 11. వెటెల్ (ఫెరారీ), 12. లెక్లెర్క్ (ఫెరారీ), 13. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 14. రసెల్ (విలియమ్స్), 15. సెయింజ్ (మెక్లారెన్), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్ (అల్ఫా రోమియో), 18. మాగ్నుసెన్ (హాస్), 19. గ్రోస్యెన్ (హాస్), 20. లతీఫీ (విలియమ్స్). -
రోస్‌బర్గ్ బోణీ
► ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ► హామిల్టన్‌కు రెండో స్థానం మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్లోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే దక్కాయి. ఆదివారం జరిగిన ఈ రేసులో నికో రోస్‌బర్గ్ విజేతగా నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 48 నిమిషాల 15.565 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ గంటా 48 నిమిషాల 23.625 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ 23వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రోస్బర్గ్కు 25 పాయింట్లు లభించాయి. 18 నెలల తర్వాత హామిల్టన్‌ను కాదని మరో డ్రైవర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి రావడం ఇదే తొలిసారి. ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 13వ స్థానంలో నిలిచాడు. ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 3న జరుగుతుంది.