
సాఖిర్: ఫార్ములావన్–2022 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి నేడు జరగనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.558 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో మొత్తం 23 రేసులు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment