ఊహకందని విధంగా టైటిల్‌ గెలిచాడు | Lewis Hamilton Won Thrilling Victory In Saudi Arabian Grand Prix | Sakshi
Sakshi News home page

Formula One: ఊహకందని విధంగా టైటిల్‌ గెలిచాడు

Published Tue, Dec 7 2021 7:40 AM | Last Updated on Tue, Dec 7 2021 7:44 AM

Lewis Hamilton Won Thrilling Victory In Saudi Arabian Grand Prix - Sakshi

జెద్దా: ఊహకందని విధంగా జరిగిన సౌదీ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ మెరిశాడు. ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో తొలి సారి ఆతిథ్యమిచ్చిన ఈ గ్రాండ్‌ప్రిలో   హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. భారతకాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్‌ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించి విన్నర్‌గా నిలిచాడు. 21.825 సెకన్లు వెనుకగా రేసును ముగించిన వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని బొటాస్‌ (మెర్సిడెస్‌) పొందాడు.

ఈ రేసులో ఫాస్టెస్‌ ల్యాప్‌ను హామిల్టనే నమోదు చేయడంతో అతడికి బోనస్‌ పాయింట్‌ లభించింది. దాంతో మొత్తం 26 (25+1) పాయింట్లు సాధించిన హామిల్టన్‌ (369.5 పాయింట్లు)... డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌ (369.5 పాయింట్లు)తో సమంగా నిలిచాడు. ఈ ఏడాది చాంపియన్‌ ఎవరనేది 12న జరిగే సీజన్‌ ముగింపు రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో తేలనుంది. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement