
ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో తొలిసారి జరిగిన స్ప్రింట్ రేస్ క్వాలిఫయింగ్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ సత్తా చాటాడు. శనివారం సిల్వర్‌స్టోన్‌లో జరిగిన 17 ల్యాప్‌ల బ్రిటిష్ గ్రాండ్‌ప్రి స్ప్రింట్ రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా 25 నిమిషాల 38.426 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో అతనికి మూడు పాయింట్లు లభించాయి. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఐదో పోల్ కాగా... ఓవరాల్‌గా ఎనిమిదోది. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 1.430 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో... సహచరుడు బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు రెండు డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్లు లభించగా... బొటాస్‌కు ఒక పాయింట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment