Qualifier tournament
-
Emma Raducanu: అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా!
ఈ టోర్నీకి ముందు ఎమ్మా రాడుకాను ... పెద్దగా ఎవరికీ తెలియని పేరు! కానీ ఆదివారం క్రీడా ప్రపంచంలో మార్మోగుతున్న పేరు అదే! ఇంతకు తను ఏం చేసింది. యూఎస్ ఓపెన్ గెలిచింది. ఓస్ అంతేనా! అంతేనా అంటారేంటి. ఆమె ఓ సంచలనం. అదేలా... మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్‌లోకి వచ్చిందే ఈ జూన్‌లో. ఆడిన అనుభవం ఒక్కటే గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్). బరిలోకి దిగిన రెండో గ్రాండ్‌స్లామ్‌లోనే విజేత! ఆమె చరిత్రకెక్కింది... మరి ఇదెలాగో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి టైటిల్ గెలవడం... రాడుకాను ఇంత చేసిందా! అవును... 18 ఏళ్ల చిన్నది చకచకా పెద్ద టోర్నీనే జయించింది. ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. –సాక్షి క్రీడావిభాగం నిజానికి ఇంత చేస్తానని, యూఎస్ ఓపెన్ గెలుస్తానని తను కూడా అనుకోలేదు కాబోలు. ఎందుకంటే రాడుకాను క్వాలిఫయింగ్ టోర్నీ దశ వరకే ఇంగ్లండ్‌కు రిటర్న్ టికెట్ (ఫ్లయిట్) కూడా బుక్ చేసుకుంది. ఓ మూడు వారాలు ప్రత్యర్థులందరినీ ఓడిస్తూ ఏకంగా ఇపుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పయనమవుతోంది. ఆమె ఆట... ఫైనల్‌దాకా ఆమె వేసుకున్న బాట ఎవరి ఊహకు అందదు. అసలు ఒకటో రెండో రౌండ్‌కే ఇంటికి చేరాల్సిన బ్రిటన్ భామ గ్రాండ్‘సలామ్’ కొట్టే ప్రదర్శన చేసింది. అమ్మ... నాన్న... ఓ కెనడా పాపాయి ఎమ్మా రాడుకాను సహా వాళ్ల అమ్మ, నాన్నది ఇంగ్లండ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురివి వేర్వేరు ప్రదేశాలు కాదు... ఏకంగా వేర్వేరు దేశాలే! నాన్న ఇయాన్ది రొమేనియా. తల్లి రెనీది చైనా. ఎమ్మా పుట్టిందేమో టోరంటో (కెనడా)! ఈ కెనడా పాపాయి రెండేళ్ల వయసులో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అక్కడే ఐదేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టింది. పదమూడేళ్లు తిరిగే సరికే (18 ఏళ్ల వయసులో) యూఎస్ ఓపెన్ చాంపియన్ అయ్యింది. జయం భళారే విజయం ఎమ్మా రాడుకాను సీడెడ్ ప్లేయరేం కాదు. ప్రపంచ 150వ ర్యాంకర్. ఓ క్వాలిఫయర్! వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే మెయిన్ ‘డ్రా’ ప్రాప్తం లభిస్తుంది. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో క్వాలిఫయర్ లక్ష్యం ఏదైనా ఉందంటే అది మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించడమే! అలా క్వాలిఫయింగ్ అంచెను దాటింది. మెయిన్ ‘డ్రా’ ఆట మొదలుపెట్టింది. ఒక్కొక్కరినీ ఒక్క సెట్ కోల్పోకుండానే కంగుతినిపించింది. ఇలా ఒకటి, రెండు కాదు... ఏడు మ్యాచ్ (ఫైనల్)ల దాకా తలవంచని ఈ టీనేజ్ సంచలనం ఏకంగా పది మ్యాచ్‌ల్లో (క్వాలిఫయింగ్ సహా) ఈ రికార్డుతో చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల టెన్నిస్‌లో ఇంతవరకు ఏ ఒక్కరికి సాధ్యం కానీ అరుదైన, అసామాన్యమైన రికార్డుతో రాడుకాను టెన్నిస్ పుటల్లో నిలిచింది. అందరినీ వరుస సెట్లలోనే! జూనియర్ స్థాయిలో మూడు టైటిల్స్ గెలిచిన రాడుకాను ఈ మధ్యే డబ్ల్యూటీఏ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టింది. ఈ జూన్‌లో నాటింగ్‌హామ్‌లో జరిగిన గ్రాస్ట్కోర్ట్ టెన్నిస్ టోరీ్నతో ఎమ్మా ఫ్రొఫెషనల్ టెన్నిస్ షురూ అయింది. మరుసటి నెలలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో ఆడింది. మూడు రౌండ్లు గెలిచి ఊపుమీదున్న రాడుకాను ప్రిక్వార్టర్స్‌లో శ్వాస సమస్యతో మ్యాచ్ మధ్యలోనే వైదొలగింది. దీంతో ఆమె వైల్డ్‌కార్డ్‌కు అనారోగ్యంతో శుభం కార్డు పడింది. కోలుకున్నాక అమెరికా వచి్చంది. గత నెల చికాగో డబ్ల్యూటీఏ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచింది. తిరిగి ఓ అనామక క్రీడాకారిణిగా యూఎస్ ఓపెన్ ఆడింది. మెయిన్ డ్రాకు చేరాక మేటి క్రీడాకారిణుల భరతం పట్టింది. ఆమె ప్రతీ మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించడం విశేషం. ఈ పరంపరలో ప్రపంచ 11వ ర్యాంకర్, టోక్యో ఒలింపిక్ చాంపియన్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను క్వార్టర్స్‌లో కంగుతినిపించింది. సెమీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న మరియా సాకరి (18వ ర్యాంక్; గ్రీస్)ని మట్టికరిపించి టైటిల్ బరిలో నిలిచింది. వర్జినియా వేడ్ తర్వాత... ఓ ఇంగ్లండ్ మహిళా టెన్నిస్ ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి దశాబ్దాలైంది. 1977లో వర్జినియా వేడ్ సొంతగడ్డపై వింబుల్డన్ గెలిచాక ఇంకెవరూ మేటి టైటిల్ గెలవనే లేదు. ఇప్పుడు రాడుకాను 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రాడుకాను 150వ స్థానం నుంచి నేడు అనూహ్యంగా 24వ ర్యాంక్‌కు ఎగబాకనుంది. అన్‌సీడెడ్ హోదాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 13వ ప్లేయర్ ఎమ్మా రాడుకాను. గతంలో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా; 2017లో యూఎస్ ఓపెన్), ఒస్టాపెంకో (లాత్వి యా; 2017లో ఫ్రెంచ్ ఓపెన్), క్లియ్‌స్టర్స్ (బెల్జియం; 2009లో యూఎస్ ఓపెన్), సెరెనా విలియమ్స్ (అమెరికా; 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్), గాస్టన్ గాడియో (అర్జెంటీనా; 2005లో ఫ్రెంచ్ ఓపెన్), ఇవానిసెవిచ్ (క్రొయేషియా; 2001లో వింబుల్డన్), కుయెర్టన్ (బ్రెజిల్; ఫ్రెంచ్ ఓపెన్ 1997), అగస్సీ (అమెరికా; 1994లో యూఎస్ ఓపెన్), బోరిస్ బెకర్ (జర్మనీ; 1985లో వింబుల్డన్), విలాండర్ (స్వీడన్; 1982లో ఫ్రెంచ్ ఓపెన్), క్రిస్ ఓనీల్ (ఆస్ట్రేలియా; 1978లో ఆస్ట్రేలియన్ ఓపెన్), మార్క్ ఎడ్మండ్సన్ (ఆ్రస్టేలియా; 1976లో ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. తన అభిమాన ప్లేయర్ హలెప్‌తో చిన్నారి రాడుకాను 🇬🇧 @EmmaRaducanu did a thing. Highlights from the women's singles final 👇 pic.twitter.com/oLKnAlyPSU — US Open Tennis (@usopen) September 11, 2021 -
వెర్‌స్టాపెన్‌కే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి పోల్ పొజిషన్
ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో తొలిసారి జరిగిన స్ప్రింట్ రేస్ క్వాలిఫయింగ్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సత్తా చాటాడు. శనివారం సిల్వర్‌స్టోన్‌లో జరిగిన 17 ల్యాప్‌ల బ్రిటిష్ గ్రాండ్‌ప్రి స్ప్రింట్ రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా 25 నిమిషాల 38.426 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో అతనికి మూడు పాయింట్లు లభించాయి. సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఐదో పోల్ కాగా... ఓవరాల్‌గా ఎనిమిదోది. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 1.430 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో... సహచరుడు బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు రెండు డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్లు లభించగా... బొటాస్‌కు ఒక పాయింట్ లభించింది. -
India Vs Bangladesh: ఆసియా కప్ బెర్త్ లక్ష్యంగా...
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్–2022 అర్హతకు దూరమైన భారత జట్టు ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఈ రెండు ఈవెంట్లకు ఉమ్మడి క్వాలిఫయింగ్ టోర్నీ ప్రస్తుతం ఖతర్ లో జరుగుతోంది. గ్రూప్ ‘ఇ’లో ఉన్న భారత్... బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ గ్రూప్‌లో ఆరు మ్యాచ్‌లాడి ఒక్కటైనా గెలవలేకపోయిన భారత్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవడం కీలకంగా మారింది. దీంతో 2023లో జరిగే ఆసియా కప్‌కు అర్హత సంపాదిస్తుంది. మొత్తం 8 గ్రూపుల్లో మెరుగైన నాలుగో స్థానంలో ఉన్న నాలుగు జట్లే మూడో క్వాలిఫయింగ్ రౌండ్‌కు నేరుగా అర్హత సంపాదిస్తాయి. ప్రస్తుతం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఖాతాలో ఒక్క గెలుపు లేదు. కాబట్టి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ (15న) లపై గెలిస్తేనే మెరుగైన నాలుగో స్థానం ఖాయ మవుతుంది. నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్– 2లో చానెల్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
ఒలింపిక్స్ బరిలో ‘రికార్డు’ పంచ్
అమ్మాన్ (జోర్డాన్): భారత్ నుంచి రికార్డు స్థాయిలో మరో బాక్సర్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ప్రపంచ కాంస్య పతక విజేత మనీశ్ కౌశిక్ (63 కేజీలు) తాజాగా ‘టోక్యో’ దారిలో పడ్డాడు. ఆసి యా క్వాలిఫయర్స్ ఈవెంట్లో బుధవారం కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, రెండో సీడ్ హరిసన్ గార్సి డ్ (ఆస్ట్రేలియా)పై 4–1తో గెలుపొందడం ద్వారా కౌశిక్‌కు ఒలింపిక్స్ బెర్తు ఖాయమైంది. ఇప్పటికే ఎనిమిది మంది బాక్సర్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. కౌశిక్‌తో ఆ జాబితా తొమ్మిదికి చేరింది. దీంతో ఈ సారి అత్యధిక బాక్సర్లు అర్హత సంపాదించినట్లయింది. గతంలో లండన్ ఒలింపిక్స్ (2012)లో భారత్ నుంచి 8 మంది పాల్గొన్నారు. ఇప్పుడీ రికార్డు 9 మందితో మెరుగైంది. 81 కేజీల కేటగిరీలో సచిన్ కుమార్ నిరాశపరిచాడు. అతను 0–5తో షబ్బొస్ నెగ్మతుల్లెవ్ (తజకిస్తాన్) చేతిలో కంగుతిన్నాడు. సిమ్రన్‌కు రజతం మహిళల 60 కేజీల ఫైనల్ బౌట్లో సిమ్రన్‌జిత్ కౌర్ పరాజయం చవిచూసింది. దీంతో ఆమె స్వర్ణావకాశం చేజారి రజతంతో సరిపెట్టుకుంది. తుదిపోరులో భారత బాక్సర్ 0–5తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యూన్ జీ చేతిలో పరాజయం పాలైంది. 69 కేజీల విభాగంలో వికాస్ క్రిషన్ కంటి గాయంతో స్వర్ణ పతక పోరు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను రజతంతో తృప్తి చెందాడు. -
9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...
గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్ 1–2తో ఒమన్ చేతిలో ఓడింది. ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ రెండు గోల్స్ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున సారథి సునీల్ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్ చేశాడు. ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్ జారవిడిచాడు. సునీల్ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్ ఖాతా తెరవలేదు. అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా బ్రెండన్ ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్ భారత గోల్ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్ ఆటగాడు అహ్మద్ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ 82వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. -
సౌదీ అరేబియా చేతిలో భారత యువ జట్టు ఓటమి
డామమ్: ఏఎఫ్సీ అండర్–19 చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్లో భారత జట్టు 0–5 స్కోరుతో ఆతిథ్య సౌదీ అరేబియా చేతిలో పరాజయం చవిచూసింది. గ్రూప్–డిలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు. సౌదీ తరఫున అల్ బ్రికాన్ (50వ ని. 81వ ని., 86వ నిమిషాల్లో), మూడు గోల్స్ చేయగా, అబ్దుల్లా అల్హమద్దన్ (15వ ని.), అల్ షహ్రాని (75వ ని.) చెరో గోల్ చేశారు. నేడు జరిగే పోరులో భారత్... యెమెన్‌తో తలపడుతుంది. 8న గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ను తుర్క్‌మెనిస్తాన్‌తో ఆడనుంది. -
ఫిక్సింగ్ కలకలం!
టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌పై ఐసీసీ అనుమానం విచారణ జరపనున్న ఏసీఎస్‌యూ అఫ్ఘానిస్తాన్ జట్టుపై అనుమానాలు ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేసినా ఫిక్సింగ్‌ను ఆపడం సాధ్యం కాదేమో. తాజాగా టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో అఫ్ఘానిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే అనుమానాలు వచ్చాయి. హాంకాంగ్‌తో ఈ జట్టు ఆడిన క్వాలిఫయర్ మ్యాచ్‌ను విచారించాలని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్ణయించింది. దుబాయ్: ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టోర్నీకి ఇందులో నుంచి ఆరు జట్లు అర్హత సాధిస్తాయి. జులై 9 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీలో మొ త్తం 14 జట్లు బరిలోకి దిగాయి. ఏడు జట్లు రెండేసి గ్రూప్‌లుగా ఆడాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐర్లాండ్, స్కాట్లాండ్ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు జట్లను తేల్చేం దుకు నాలుగు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహించాలి. ఇందులో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ తొలి మ్యాచ్ ఆడాయి. ఇందులో గెలిచిన హాంకాంగ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ రెండు జట్లు గ్రూప్ దశలో రెండు, మూడు స్థానాల్లో నిలిచినందున... ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు కు మళ్లీ మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మంగళవారం ఓడిపోయిన అఫ్ఘానిస్తాన్ జట్టు గురువారం జరిగే మ్యాచ్‌లో పపువా న్యూగినియా జట్టుతో ఆడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడొచ్చు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ తొలుత 161 పరుగులు చేసింది. హాంకాంగ్ ఆఖరి బంతికి రెండు పరుగులతో 162 లక్ష్యాన్ని ఛేదించి నెగ్గింది. చివరి ఓవర్లో హాంకాంగ్ ఏకంగా 16 పరుగులు సాధించింది. మామూలుగా మ్యాచ్ చూసిన వాళ్లకి ఇది అద్భుతమైన ఉత్కంఠతో సాగిన పోరు. కానీ ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం బయట బెట్టింగ్‌లు సాగిన విధానం వల్ల వీరికి అనుమానం వచ్చింది. దీంతో బెట్టింగ్‌లు నిర్వహించే సంస్థలను సంప్రదించారు. బెట్‌ఫెయిర్ సహా ప్రముఖ బెట్టింగ్ సంస్థలన్నింటిలోనూ విచారణ సాగించనున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధిం చిన బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగింది. ఫలితం ముందే తెలిసినట్లుగా పందేలు సాగాయి.