డామమ్: ఏఎఫ్‌సీ అండర్–19 చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భారత జట్టు 0–5 స్కోరుతో ఆతిథ్య సౌదీ అరేబియా చేతిలో పరాజయం చవిచూసింది. గ్రూప్–డిలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు. సౌదీ తరఫున అల్ బ్రికాన్ (50వ ని. 81వ ని., 86వ నిమిషాల్లో), మూడు గోల్స్ చేయగా, అబ్దుల్లా అల్హమద్దన్ (15వ ని.), అల్ షహ్‌రాని (75వ ని.) చెరో గోల్ చేశారు. నేడు జరిగే పోరులో భారత్... యెమెన్‌తో తలపడుతుంది. 8న గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ను తుర్క్‌మెనిస్తాన్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment