దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్–2022 అర్హతకు దూరమైన భారత జట్టు ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఈ రెండు ఈవెంట్లకు ఉమ్మడి క్వాలిఫయింగ్ టోర్నీ ప్రస్తుతం ఖతర్ లో జరుగుతోంది. గ్రూప్ ‘ఇ’లో ఉన్న భారత్... బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ గ్రూప్‌లో ఆరు మ్యాచ్‌లాడి ఒక్కటైనా గెలవలేకపోయిన భారత్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవడం కీలకంగా మారింది. దీంతో 2023లో జరిగే ఆసియా కప్‌కు అర్హత సంపాదిస్తుంది. మొత్తం 8 గ్రూపుల్లో మెరుగైన నాలుగో స్థానంలో ఉన్న నాలుగు జట్లే మూడో క్వాలిఫయింగ్ రౌండ్‌కు నేరుగా అర్హత సంపాదిస్తాయి.
ప్రస్తుతం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఖాతాలో ఒక్క గెలుపు లేదు. కాబట్టి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ (15న) లపై గెలిస్తేనే మెరుగైన నాలుగో స్థానం ఖాయ మవుతుంది. నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్– 2లో చానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment