
దోహా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఖతర్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 24 నిమిషాల 28.471 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... అలోన్సో (అల్పైన్) మూడో స్థానంలో నిలిచాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్‌లో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెర్‌స్టాపెన్ 351.5 పాయింట్లతో తొలి స్థానంలో, హామిల్టన్ 343.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి డిసెంబర్ 5న జరగనుంది.
చదవండి: కోహ్లీ కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్
Comments
Please login to add a commentAdd a comment