ఇండియన్ టాప్ ఫార్ములావన్ రేసర్ జెహన్ దారువాలా మహీంద్రా రేసింగ్ ఫార్ములా-ఈ టీమ్‌లో జాయిన్ అయ్యాడు. కాగా ఫార్ములా-2 రేస్ గెలిచిన తొలి ఇండియన్ రేసర్‌గా జెహన్ దారువాలా చరిత్ర సృష్టించాడు. మరే భారతీయ రేసర్‌కు ఇది సాధ్యం కాలేదు. కాగా తాజాగా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు చెందిన మహీంద్రా రేసింగ్ ఫార్ములా టీమ్‌లో చేరిన దారువాలా సీజన్-9లో ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌లో టెస్ట్ అండ్ రిజర్వ్ డ్రైవర్‌గా కొనసాగనున్నాడు.
ఎవరీ జెహన్ దారువాలా?
ముంబైకి చెందిన 24 ఏళ్ల జెహన్ దారువాలాకు చిన్నప్పటి నుంచి కార్ రేసింగ్ అంటే యమా క్రేజ్ ఉండేది. ఎలాగైనా ఫార్ములా వన్ రేసర్‌గా మారాలనుకున్నాడు. దానికోసం అమెరికా వెళ్లి రేసింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక ప్రొఫెషన్‌లగా మారిన తర్వాత ఫార్ములా వన్ రేసర్‌గా కెరీర్‌ను ఎంజాయ్ చేసిన దారువాలా 2019లో ఫార్ములా-3 చాంపియన్‌షిప్‌ను గెలిచాడు. ఆ తర్వాత 2021లో ఎఫ్-3 ఏసియన్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న దారువాలా పార్ములా-2లో మూడేళ్లలో నాలుగు రేస్‌లు గెలవడం విశేషం.
ఇక ఈ ఏడాది జూలైలో ఆస్ట్రియాలోని స్పీల్‌బర్గ్‌లో జరిగిన ఫార్ములా-2లో పాల్గొన్న దారువాలా బహ్రెయిన్ వేదికగా జరిగిన సీజన్ చివరి మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. రెండవ స్థానం నుండి మ్యాచ్ ప్రారంభించిన జెహన్ దారువాలా చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో డేనియల్ డిక్టమ్, మిక్ షూమేకర్, జెహన్ దారువాలా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో మొదట కాస్త వెనుకబడి ఉన్న జెహన్ చివరకు చేరే సరికి మొదటి స్థానంలో నిలిచాడు. అలా ముంబైకి చెందిన జెహన్ దారువాలా ఫార్ములా-2 రేసులో తొలి విజయాన్ని పొంది యావత్ భారతదేశానికి గర్వకారణం అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment