
యువ భారత రేసర్ జెహాన్ దారూవాలా ఫార్ములావన్ కోసం తొలి అడుగు వేశాడు. మెక్‌లారెన్ జట్టు తరఫున అతను ఎఫ్1 టెస్టును విజయవంతంగా పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్ ట్రాక్‌పై ‘ఎంసీఎల్ 35ఎమ్’ కారును ‘రయ్... రయ్’మనిపించాడు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ టెస్టు డ్రైవ్‌లో జెహాన్ 130 ల్యాప్‌లను ఇబ్బంది లేకుండా పూర్తి చేశాడు. దీంతో ఎఫ్1 డ్రైవర్ అయ్యేందుకు ‘సూపర్ లైసెన్స్’ దరఖాస్తుకు అవసరమైన పాయింట్లను భారత రేసర్ సాధించాడు.
చదవండి: Wimbledon 2022 Draw: 113వ ర్యాంకర్‌తో సెరెనా తొలిపోరు