
Azerbaijan Grand Prix: ఫార్ములావన్ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఈ ఏడాది ఐదో టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు.
51 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 05.941 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో 21వ ల్యాప్‌లో వైదొలిగాడు.
చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!