
ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌ను ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్‌గా పిలవనున్నారు. ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన 36 ఏళ్ల హామిల్టన్‌ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 2007 నుంచి ఎఫ్1లో ఉన్న హామిల్టన్ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు.
చదవండి: Ruturaj Gaikwad: 4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్.. అయినా పాపం!