Knighthood
-
మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్‌కు నైట్‌హుడ్.. ఇకపై "సర్" స్టువర్ట్ బ్రాడ్‌గా..!
కొద్ది రోజుల కిందట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్‌కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్‌కు, ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్‌కు చేసిన సేవలకు గాను బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యూకే ఎంపీలంతా బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్ నైట్‌హుడ్‌కు అర్హుడని యూకే ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఒకవేళ బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్" వచ్చి చేరుతుంది. క్రికెట్లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్ బిరుదు తొలుత ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాన్సిస్ ఎడెన్ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్ దిగ్గజం, ఆసీస్ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్, జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), లెన్ హటన్ (ఇంగ్లండ్), రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), గ్యారీ సోబర్స్ (విండీస్), కర్ట్లీ ఆంబ్రోస్ (విండీస్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) వంటి పలువురు క్రికెట్ దిగ్గజాలు నైట్‌హుడ్ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్కుమార్కు నైట్‌హుడ్ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి 2 టెస్ట్‌లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ విజయాల్లో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్‌గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్‌గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్‌గా బ్రాడ్ టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా (604), ఓవరాల్‌గా ఏడో అత్యధిక వికెట్ టేకర్‌గానూ (847) రికార్డుల్లో నిలిచాడు. -
బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్‌కు ‘నైట్‌హుడ్’
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్‌హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. -
ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్...
ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌ను ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్గా పిలవనున్నారు. ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన 36 ఏళ్ల హామిల్టన్‌ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 2007 నుంచి ఎఫ్1లో ఉన్న హామిల్టన్ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు. చదవండి: Ruturaj Gaikwad: 4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్.. అయినా పాపం! -
శంకర్ సుబ్రమణియన్ కు అరుదైన గౌరవం
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్, డీఎన్ఏ పరిశోధకుడు శంకర్ సుబ్రమణియన్(50)ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ హోదాతో సత్కరించింది. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. జీవశాస్త్రం, వైద్యశాస్త్రంలో గొప్ప ముందడుగుగా భావించే తరువాతి తరం డీఎన్ఏ అనుక్రమణాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్‌కు గుర్తింపు ఉంది. ‘సొలెక్సా సీక్వెన్సింగ్గా పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జన్యువు అనుక్రమణాన్ని పూర్తిచేయొచ్చు. గతంలో మానవ జన్యువు అనుక్రమణానికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది. ఆయన పరిశోధనంతా అధునాతన బయోఇన్ఫార్మాటిక్స్లోనే కొనసాగిందని’ ఆయనకిచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. -
భారత సంతతి వైద్యుడికి ‘నైట్‌హుడ్’
లండన్: లండన్‌లోని భారత సంతతికి చెందిన హర్పాల్ సింగ్ కుమార్ అనే కేన్సర్ వ్యాధి నిపుణుడికి అరుదైన గౌరవం లభించింది. కేన్సర్ వ్యాధి చికిత్స, నివారణలో ఆయన చేసిన సేవలకు గాను ఎలిజబెత్ రాణి అందించే ప్రతిష్టాత్మకమైన ‘నైట్‌హుడ్’ (సర్ బిరుదు) వరించనుంది. ఏటా ప్రముఖ వ్యక్తులకు అందజేసే ‘నైట్‌హుడ్’ జాబితా గురువారం విడుదలైంది. ప్రస్తుతం ఆయన లండన్‌లోని కేన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందిస్తున్నారు. కాగా, ఫండింగ్ సర్కిల్ కంపెనీ సీఈవో సమీర్ దేశాయ్‌కి ఆర్థిక రంగంలో చేసిన కృషికి గాను ‘కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ (సీబీఈ) బిరుదు ఇవ్వనున్నారు. ఆఫీసర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ జాబితాలో కిడ్డికేర్ లిమిటెడ్ నర్సరీస్ మేనేజింగ్ డెరైక్టర్ కలా పటేల్ పేరు కూడా ఉంది. బ్రిటిష్ ఎంపైర్ పతకాన్ని అశోక్ అనద్కట్, ఆటిన్ అశోక్‌లకు ఇవ్వనున్నారు. -
మౌనంగా ఎదిగిన మహావృక్షం
సందర్భం : 7న టాగోర్ జయంతి ఈ నెల 7 నుంచి రవీంద్రనాథ్ టాగోర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రపంచం ఈ విశ్వకవికి వివిధ కార్యక్రమాల ద్వారా ఘనమైన నివాళి ఇవ్వబోతోంది. పైగా ఇది టాగోర్ ‘నైట్‌హుడ్’ పొందిన శత సంవత్సరం కూడా. 1915లో బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జి ఈ టైటిల్‌ను టాగోర్‌కి ప్రదానం చేశారు. ఆ తర్వాత ఆయన నైట్‌హుడ్‌ను తిరిగి ఇచ్చేయడం వేరే సందర్భం. ‘కనస్యూర్’ అనే ఇంగ్లిష్ మాటకు ‘రసహృదయ ప్రావీణ్యుడు’ అని అర్థం. ఈ మాట కూడా అర్థం కాని వాళ్లు ‘రవీంద్రనాథ్ టాగోర్’ అని అర్థం చెప్పుకోవచ్చు. సాహిత్యం, సంగీతం, చిత్రకళల రుచి, శుచి తెలిసిన మనిషి టాగోర్. ‘జనగణమన’కు జాతీయగీతంగా అంత ప్రాముఖ్యం వచ్చింది టాగోర్ కవితాప్రావీణ్యం వల్లనే. మనదే కాదు, బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా టాగోర్ రాసిందే. శ్రీలంక జాతీయగీతానికి సైతం మూలకణాలు టాగోర్ రచనలోనివే! ఆయన కనస్యూర్ మాత్రమే కాదు. ‘పాలీమేథ్’ కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశీలి. ‘రబీ’ ఒంటరి పిల్లవాడు రవీంద్రనాథ్ టాగోర్ 1891 మే 7న కలకత్తాలో జన్మించారు. అన్నలు, అక్కలు కలిపి ఆయన తలపై ఉన్నవారు మొత్తం 13 మంది. ఇక చూడండి ఆ ‘బాసిజం’ ఎలా ఉంటుందో! సంప్రదాయ బాసిజం అన్నమాట! బాగా సంపన్న కుటుంబం. ప్రతి అన్నకీ, అక్కకీ ఏదో ఒక టాలెంట్ ఉంటేది. నాటకాలు రాసేవారు, కవితలు వినిపించేవారు, బ్రిటిష్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు... ఇలా! పెద్దపెద్ద సంగీతకారులు, సాహితీవేత్తలూ నిర్విరామంగా ఆ ఇంటికి వచ్చిపోతుండేవారు. చిన్నప్పుడు చూడాలి ‘రబీ’ (రవీంద్రనాథ్ టాగోర్) దాక్కుని దాక్కుని తిరిగేవారు. అమ్మ పోయాక రబీ మరీమౌనంగా అయిపోయాడు. ఒంటరిగా ఉండిపోయేవాడు. టాగోర్ పదమూడో ఏట తల్లి శారదాదేవి చనిపోయారు. ఎస్టేట్ పనుల మీద తండ్రి దేవేంద్రనాథ్ టాగోర్ ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరిగేవారు. టాగోర్‌కి స్కూల్ అంటే ఇష్టం లేదు, ద్వేషం కూడా! ఇక లాభం లేదని పెద్దన్నయ్య టాగోర్ని ఇంట్లోనే ఉంచి లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, మేథ్స్, శాంస్క్రిట్, ఇంగ్లిష్, డ్రాయింగ్ నేర్పారు. ఇంట్లో నేర్చుకోవడం కూడా టాగోర్‌కి ఇష్టం లేదు. అతడి దృష్టంతా బయటి ప్రకృతి మీదే. గంగానదిలో ఈదాలని, కొండలు గుట్టలు ఎక్కాలనీ.. అదో లోకంలో ఉండేవాడు. ఆ లోకంలోంచి ఆవిర్భవించిందే, పెద్దయ్యాక టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ పాఠశాల. చెట్ల మధ్య ఆరుబయటి తరగతి గదుల స్కూల్ అది. ఇరవై ఏళ్లలో రెండు వేలు! టాగోర్ ప్రధానంగా రచయిత. కవి. చిన్నచిన్న కథలు చాలా రాశారు. గొప్పగొప్ప కవితలల్లారు. పాటలు రాశారు. నాటక రచయితగా కూడా ప్రసిద్ధులయ్యారు. ఆయన కవితా సంకలం ‘గీతాంజలి’ ఆయనకు నోబెల్ బహుమతి సంపాదించిపెట్టింది. అలా ఆసియా ఖండానికి తొలి నోబెల్ దక్కింది. టాగోర్ మంచి చిత్రకారుడు కూడా. కానీ ఆయనకు ఆ అభిరుచి 60 యేట మొదలైనది! ఆయన 80 ఏళ్లు బతికారు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో టాగోర్ రెండు వేల చిత్రాలు గీశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా అవన్నీ జీవ కళ ఉట్టిపడేవి. ఆర్ట్ ఆయన నేర్చుకున్నది కాదు. తనకు తానుగా తీర్చిదిద్దుకున్నది. ఆర్ట్‌ను అధ్యయనం చేయడం కోసం టాగోర్ ఐరోపా ఖండం తిరిగొచ్చారు. పాల్ క్లీ, హెన్రీ మెటిస్సీ, కాండిన్స్కీ వంటి మహనీయుల చిత్రలేఖన రీతులను సునిశితంగా పరిశీలించారు. ఆ అవగాహనతో ప్రకృతి దృశ్యాలు, పోట్రెయిట్‌లు, నైరూప్య చిత్రాలు గీశారు. టాగోర్ చిత్రాలు గాఢమైన రంగుల కలగాపులగంలా ఉంటాయి. ‘‘ఏంటీ మనిషి, వర్ణాల వ్యత్యాసాన్ని గుర్తించలేడా’’అని టాగోర్ని విమర్శించినవారూ ఉన్నారు. నైట్‌హుడ్ తిరస్కారం టాగోర్‌లోని రసహృదయ ప్రావీణ్యాన్నీ, బహుముఖ ప్రజ్ఞాశీలతను గుర్తించిన బ్రిటిష్ రాజు ఆయనకు ‘నైట్‌హుడ్’ను ప్రదానం చేశారు. అంటే టాగోర్ అప్పటి నుంచి ‘సర్’ టాగోర్ అని. అయితే 1919తో జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్న వందలాదిమంది భారతీయులను బ్రిటిష్ ప్రభుత్వం కాల్చిచంపడంతో టాగోర్ తీవ్రమనస్థాపానికి గురయ్యారు. తన నైట్ హుడ్ను తిరిగి ఇచ్చేశారు. టాగోర్ 1941 ఆగస్టు 7న చనిపోయారు. ఆయన పుట్టిన రోజు, మరణించి రోజు 7వ తేదీ కావడం విశేషం.