శంకర్ సుబ్రమణియన్ కు అరుదైన గౌరవం
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్, డీఎన్‌ఏ పరిశోధకుడు శంకర్ సుబ్రమణియన్(50)ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ హోదాతో సత్కరించింది. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. జీవశాస్త్రం, వైద్యశాస్త్రంలో గొప్ప ముందడుగుగా భావించే తరువాతి తరం డీఎన్‌ఏ అనుక్రమణాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్‌కు గుర్తింపు ఉంది.
‘సొలెక్సా సీక్వెన్సింగ్‌గా పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జన్యువు అనుక్రమణాన్ని పూర్తిచేయొచ్చు. గతంలో మానవ జన్యువు అనుక్రమణానికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది. ఆయన పరిశోధనంతా అధునాతన బయోఇన్ఫార్‌మాటిక్స్‌లోనే కొనసాగిందని’ ఆయనకిచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.