మా దేశంలో పెట్టుబడులు పెట్టండి
బెల్జియం కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పెట్టుబడులకు సరైన ప్రాంతం బెల్జియం అని, అక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని ఆ దేశ కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్ అభిప్రాయపడ్డారు. బెల్జియం దేశానికి పారిస్, లండర్, ఫ్రాంక్‌ఫర్డ్ వంటి గొప్ప గొప్ప రాజధానులకు 300 కి.మీ.లకు మించి దూరం లేదని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో ‘బెల్జియం- యూరప్‌లో పెట్టుబడులకు సరైన ప్రాంతం’ అనే అంశంపై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. కార్యక్రమంలో బ్రెజిల్ ఇన్వెస్టిమెంట్ ఎక్స్‌పర్ట్ క్యాథలిన్ ఫ్రూతాఫ్, ఎస్‌ఏఎస్ పార్టనర్స్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రై.లి. డెరైక్టర్ అలెక్స్ టీ కోశీ, ఎఫ్‌టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, చైర్మన్ రాజ్‌కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.