Special subsidies
-
యాంకర్ యూనిట్లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు
-
కొప్పర్తిలో కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలోగా వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపుతోపాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీ లాంటి పలు రాయితీలు అందచేస్తోంది. ఇక్కడి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే తొలి కంపెనీగా ‘పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. రెండో కంపెనీగా నీల్కమల్ లిమిటెడ్ రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి జూన్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, నీల్కమల్ ఇండియాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం రూ.పది లక్షల చొప్పున 117.85 ఎరాల కేటాయింపు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఎకరం ధరను ఏపీఐఐసీ రూ.25 లక్షలుగా నిర్ణయించగా తొలి కంపెనీ కావడంతో పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు ప్రత్యేక రాయితీ కింద ఎకరం రూ.10 లక్షల చొప్పున మొత్తం 117.85 ఎకరాలను కేటాయించారు. నీల్‌కమల్‌కు 105 ఎకరాలు కేటాయించారు. స్టాంపు డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చారు. ► తొలి 8 సంవత్సరాలు లేదా ఎఫ్‌సీఐ పరిమితి 100 శాతం ఇందులో ఏది ముందు అయితే అప్పటివరకు 100 శాతం ఎస్జీఎస్టీ నుంచి మినహాయింపు. ► స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. గరిష్టంగా రూ.10 కోట్లు ► ఏడాదికి 5 శాతం వడ్డీ రాయితీ గరిష్టంగా రూ.1.50 కోట్లు ► తొలి ఐదేళ్లు విద్యుత్ చార్జీ యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లిస్తారు. ► తొలి ఐదేళ్లు లాజిస్టిక్ సబ్సిడీ అందిస్తారు. ఏటా గరిష్టంగా రూ.50 లక్షలు చొప్పున దేశీయ రవాణాలో 25 శాతం సబ్సిడీ కల్పిస్తారు. -
చాకిరీ 60% భూమి 14%!
వ్యవసాయంలో మహిళల శ్రమ వాటా రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా, మహిళా రైతులుగా వారికి గుర్తింపు పెద్దగా దక్కటం లేదు. పితృస్వామిక వ్యవస్థ, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మహిళా రైతుల హక్కులకు గుర్తింపు లేకుండా పోతోంది. ఈ నెల 15న జాతీయ మహిళా రైతుల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా. కమతాలు చీలిపోయి చిన్నవి అవుతున్న కొద్దీ, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతున్న కొద్దీ పురుషులు ఇతర రంగాలవైపు దృష్టి సారించడం పెరుగుతోంది. అనివార్యంగా వ్యవసాయ పనులన్నీ మహిళలపైనే పడుతున్నాయి. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం మన దేశంలో ఆహారోత్పత్తిలో మహిళల శ్రమ 60–80 శాతం. పాడి పరిశ్రమలో 90%. ఇది ఇంటిపనికి అదనం. 2010–11 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. దేశంలో 11 కోట్ల 87 లక్షల మంది సాగుదారులుంటే ఇందులో 30.3% మంది మహిళా రైతులు. 14.43 కోట్ల వ్యవసాయ కూలీల్లో 42.6% మహిళలు.అయినా, మహిళలకు భూమిపై హక్కు 14% మాత్రమే. 2015 జనాభా గణన ప్రకారం.. వ్యవసాయ రంగంలో ఉన్న 86 శాతం మంది మహిళల పేరు మీద సెంటు భూమి కూడా లేదు. మహిళలకు భూమి హక్కు వచ్చినప్పుడే రైతుగా ప్రభుత్వ సహాయాన్ని, రుణాలను, శిక్షణావకాశాలను పొందగలుగుతారు. అభివృద్ధి చెందుతున్న మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించి గుర్తింపు ఇస్తే వ్యవసాయ ఉత్పత్తి 2.5–4% వరకు పెరుగుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేస్తోంది. వ్యవసాయ పనుల్లోని ప్రతి దశలోనూ నడ్దివిరిచే చాకిరీ చేసే మహిళల శ్రమ తగ్గించే యంత్రపరికరాలను, వారికి తగినట్టుగా తక్కువ బలాన్ని వినియోగించాల్సిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేయడం అవసరం. ఇప్పుడున్న యంత్ర పరికరాలన్నీ పురుషులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినవే. మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసే యంత్ర పరికరాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళా రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది! -
మా దేశంలో పెట్టుబడులు పెట్టండి
బెల్జియం కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పెట్టుబడులకు సరైన ప్రాంతం బెల్జియం అని, అక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని ఆ దేశ కౌన్సిల్ జనరల్ డాక్టర్ బర్ట్ డీగ్రూఫ్ అభిప్రాయపడ్డారు. బెల్జియం దేశానికి పారిస్, లండర్, ఫ్రాంక్‌ఫర్డ్ వంటి గొప్ప గొప్ప రాజధానులకు 300 కి.మీ.లకు మించి దూరం లేదని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో ‘బెల్జియం- యూరప్‌లో పెట్టుబడులకు సరైన ప్రాంతం’ అనే అంశంపై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. కార్యక్రమంలో బ్రెజిల్ ఇన్వెస్టిమెంట్ ఎక్స్పర్ట్ క్యాథలిన్ ఫ్రూతాఫ్, ఎస్ఏఎస్ పార్టనర్స్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రై.లి. డెరైక్టర్ అలెక్స్ టీ కోశీ, ఎఫ్టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, చైర్మన్ రాజ్‌కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.