ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే రక్ష అని తెలిసినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు. చాలా మంది అయితే ఇప్పటకీ మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఓ వ్యక్తి మాత్రం తొమ్మిదో సారి వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చి.. అక్కడ ఉన్నవారందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది.
బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్ చార్లెరోయ్ నగరంలో ఓ యువకుడు వ్యాక్సిన్ తీసుకోకుండా సర్టిఫికెట్ పొందాలనుకునే వారిని సంప్రదించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారి స్థానంలో అతను వ్యాక్సిన్ వేయించుకోవటం మొదలు పెట్టాడు. టీకా తీసుకున్న తరువాత టీకా ధృవీకరణ పత్రాన్ని సదరు వ్యక్తులకు ఇచ్చేవాడు. ఇలా ఆ వ్యక్తి తొమ్మిదోసారి వ్యాక్సిన్ కోసం స్థానిక వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి సిబ్బందికి పట్టుబడ్డాడు.
సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పటకీ ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఇప్పటికీ 8 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటికీ అతను పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడంలేదని సమాచారం. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment