భువనేశ్వర్: భారత గడ్డ బెల్జియం హాకీ జట్టు తలరాతను మార్చేసింది. ప్రపంచకప్ హాకీలో స్వర్ణ చరిత్రను ‘రెడ్ లయన్స్’ పేరిట రాసింది. ఇన్నేళ్లుగా క్వార్టర్స్ దాటని జట్టును ఈసారి చాంపియన్‌గా చేసింది. కళింగ స్టేడియంలో ఆదివారం నిర్ణీత సమయానికల్లా ఒక్క గోల్ కానీ ఫైనల్ మ్యాచ్ చివరికొచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఇదీ చాలదన్నట్లు సడెన్‌డెత్ దాకా హైడ్రామా కొనసాగింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో... ఆఖరి క్షణం వరకు దోబూచులాడిన విజయం చివరకు బెల్జియంను వరించింది. బెల్జియం ‘సడెన్ డెత్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. దీంతో గత ప్రపంచకప్‌లాగే ఈసారి డచ్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8–1తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment