ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన హెచ్‌ఐ
గుర్బాజ్ సింగ్‌కు టీమ్‌లో చోటు
న్యూఢిల్లీ: స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్ ప్రపంచకప్ హాకీలో భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. మే 31 నుంచి నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరగనున్న ప్రపంచకప్ కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
అనుభవజ్ఞుడు, మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సర్దార్ సారథ్యంలోని భారత జట్టు ఈ నెల 21 హేగ్‌కు బయల్దేరి వెళ్లనుంది. ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు పూల్-ఎలో ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, స్పెయిన్, మలేసియాలతో గట్టి పోటీ ఎదురుకానుంది. మే 31న జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.
భారత జట్టు: సర్దార్ సింగ్(కెప్టెన్), గోల్‌కీపర్లు-శ్రీజేష్, హర్‌జోత్‌సింగ్, డిఫెండర్లు-గుర్బాజ్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, రఘునాథ్, వీరేంద్ర లాక్రా, కోథాజిత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, మిడ్‌ఫీల్డర్లు-ఉతప్ప, ధరమ్‌వీర్ సింగ్, జస్జిత్ సింగ్, చింగ్‌లెన్సనా సింగ్, ఫార్వర్డ్‌లు-సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, తిమ్మయ్య, మన్‌దీప్ సింగ్.
భారత హాకీ సారథిగా సర్దార్ సింగ్
Published Thu, May 15 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement