బెల్జియంతో భారత్ తొలి పోరు | India to start Hockey World Cup campaign with tie against Belgium | Sakshi
Sakshi News home page

బెల్జియంతో భారత్ తొలి పోరు

Published Sat, Feb 1 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

India to start Hockey World Cup campaign with tie against Belgium

న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడనుంది. ఈమేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్‌లో మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది.
 
 పటిష్ట జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్.. 31న బెల్జియంతో, జూన్ 2న ఇం గ్లండ్‌తో, 5న స్పెయిన్‌తో, 7న మలేసియాతో 9న ప్రపంచ చాంపియన్స్ ఆసీస్‌తో తలపడుతుంది. ఓవరాల్‌గా 76 మ్యాచ్‌లు జరుగనుండగా పూల్ దశలో రోజుకు 6 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మహిళల ప్రపంచకప్ హాకీ కూడా సమాంతరంగా జరుగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement