
హామిల్టన్ (న్యూజిలాండ్): నాలుగు దేశాల తొలి అంచె అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో లీగ్ మ్యాచ్‌లో, ఫైనల్లో బెల్జియం చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో అంచె టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (4వ, 42వ ని.లో) రెండు గోల్స్ చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (46వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (53వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (59వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
బెల్జియం జట్టుకు జాన్ డోమెన్ (17వ ని.లో), ఫెలిక్స్ డెనాయర్ (37వ ని.లో), అలెగ్జాండర్ హెండ్రిక్స్ (45వ ని.లో), టామ్ బూన్ (56వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. శనివారం జరిగే మూడో లీగ్ మ్యా చ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment