పన్ను‘పోటు’ దేశాలు | Tax 'pressure' countries | Sakshi
Sakshi News home page

పన్ను‘పోటు’ దేశాలు

Published Tue, Mar 1 2016 4:27 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

పన్ను‘పోటు’ దేశాలు - Sakshi

పన్ను‘పోటు’ దేశాలు

ఒక్కొక్క దేశంలో ఒక్కోపన్ను విధానం...  ప్రపంచంలోని ఎక్కువ వసూలు చేస్తున్న మొదటి ఎనిమిది దేశాల జాబితా ఇది..
 
 అరుబా
 (కరేబియన్ సముద్రంలోని ద్వీప దేశం)
 పన్ను రేటు: 58.95 శాతం

 
► ఉద్యోగులకు చెల్లించే జీతాల ఆధారంగా వసూలు ఉండదు. మూలధనం పన్ను కూడా లేదు. 15 శాతం వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు
 
 స్వీడన్
 పన్ను రేటు: 56.60 శాతం
 
► {పజలకు ఉచిత విద్య, రాయితీతో వైద్య సేవలు, ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.  కంపెనీలు సోషల్ సెక్యూరిటీగా 31.42% పన్ను చెల్లించాలి. మూలధన రాబడులపై 30%  చెల్లించాలి.
 
 డెన్మార్క్
 పన్ను రేటు: 55.56 శాతం
 

► 2008లో 62.3గా ఉన్న పన్ను రేటును తగ్గించారు. ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ లేదు. భాగస్వామి నుంచే సంక్రమించే ఆస్తికి పన్ను విధించరు. ఇతరుల నుంచి ఆస్తి సంక్రమిస్తే కట్టాల్సిందే
 
 నెదర్లాండ్స్
 పన్ను రేటు: 52.00 శాతం
 
► ఈ దేశంలో ఉద్యోగుల జీతాలపై పన్ను లేదు. అలాగే స్టాంప్ డ్యూటీ వసూలు చేయరు. ఆస్తి మార్పిడిపై మాత్రం 6 శాతం వసూలు చేస్తున్నారు.
 
 బెల్జియం
 పన్ను రేటు: 50.00 శాతం
 
► అతి ఎక్కువ సంవత్సరాదాయమున్న ఉద్యోగులు మొత్తంలో 40 శాతం మాత్రమే ఇంటికెళ్తారు. 13 శాతం సోషల్ సెక్యూరిటీ పన్ను చెల్లించాల్సి ఉండగా.. అందులో ఉద్యోగి వాటా 35 శాతం..
 
జపాన్
 పన్ను రేటు: 50.00 శాతం
 
► దాదాపు రూ. 1.55 కోట్ల సంవత్సర ఆదాయముంటే 50 శాతం వసూలు చేస్తారు. ఈ పన్నులు రెండుగా విభజించారు. 40 శాతం మార్జినల్ పన్ను, 10 శాతం ప్రాపర్టీ పన్ను
 
 యునెటైడ్ కింగ్‌డమ్
 పన్ను రేటు: 50.00 శాతం

 ► రూ.1.60 కోట్ల ఆదాయం వస్తే 50 శాతం చెల్లించాల్సిందే.. సోషల్ సెక్యూరిటీ కోసం 14 శాతం వసూలు చేస్తున్నారు.
 
 ఫిన్‌లాండ్
 పన్ను రేటు: 49.20 శాతం
 
► సంవత్సర ఆదాయం  రూ. 62 లక్షలుంటే 49.2 శాతం కట్టాల్సిందే. కేపిటల్ గెయిన్స్‌పై 28 శాతం పన్ను ఉండగా, 21 శాతం మున్సిపల్ ట్యాక్స్ చెల్లించాలి.
 
 ఇండియా
 ఇండియాలో గరిష్టంగా 30%  వసూలు చేస్తుండగా... కనిష్ట 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement