అతిపెద్ద బాలల మ్యూజియం! | Worlds Largest Childrens Museum Of Indianapolis In USA | Sakshi
Sakshi News home page

అతిపెద్ద బాలల మ్యూజియం!

Published Sun, Nov 12 2023 10:54 AM | Last Updated on Sun, Nov 12 2023 10:54 AM

Worlds Largest Childrens Museum Of Indianapolis In USA - Sakshi

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఉంది. మేరీ స్టూవర్ట్‌ కారే అనే సంపన్న వ్యాపారవేత్త 1924లో బ్రూక్లిన్‌ బాలల మ్యూజియం చూశారు. దాని ప్రేరణతోనే ఆమె ఇండియానాపోలిస్‌లో స్థానిక దాతల సహకారంతో 1925లో ఈ మ్యూజియంను నెలకొల్పారు. దీనిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 1946లో కొత్త నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఉన్న చోటికి తరలించారు.

దాదాపు 4.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో పిల్లల వినోద విజ్ఞానాలకు పనికొచ్చే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పురాతనమైన ఆటవస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంకు ఏటా దాదాపు పదిలక్షల మందికి పైగానే సందర్శకులు వస్తుంటారు. 

(చదవండి:  వలలో అరుదైన చేపలు..దెబ్బతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మత్స్యకారుడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement