మా అమ్మాయి పసికూన" .. "అబ్బాయి బుడ్డోడు" .. "ఇంకా ఏమీ తెలియదు" . ఇదే తల్లితండ్రుల ఆలోచనలు . మీ ప్రేమ చల్లగుండా. పిల్లలు దేవుడు చల్లని వారే .. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. కానీ ..మధ్యలో స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ టీవీలు దురాయి స్వామి. అమాయకత్వం అర్హత కాదు. గురువు / తల్లితండ్రి సరైన రీతిలో ఎడ్యుకేట్ చెయ్యకపోతే పిల్లలు బయటి సమాజం నుంచి నేర్చుకొంటారు . చెడుదారిలో వెళ్లి పోతారు ." అయ్యో .. అప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా చేస్తుందని అనుకోలేదు" అని అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి ? దీని గురించి మానసిక శాస్త్ర పరిశోధకులు వాసిరెడ్డి అమర్‌నాథ్ గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్ధాం.
ఒకసారి నేను హైస్కూల్ పిల్లలకు ఇచ్చిన హోం టాస్క్‌లో..ఐఐటీ విద్యార్థులు కూడా, ఆత్మ హత్యలు చేసుకొంటున్న ఘటనలు జరుగుతున్నాయి . దీనికి గల కారణాలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించండి. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య చదివిన కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణాలను, పరిష్కార మార్గాలను చర్చించండి, తదితరాల గురించి ఇచ్చాం. వారు ఇంట్లో తల్లిదండ్రులతో అవసరమయితే బంధువులతో చర్చించి సమాచారం సేకరించి చర్చకు సిద్ధం కావాలి. అటుపై క్లాస్ రూమ్ లో మెంటార్ పర్యవేక్షణలో డిబేట్ జరుగుతుంది.
కొంతమంది తల్లితండ్రులు ఈ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. "మా పిల్లలు ఇంకా పసివారు. వారికి ఆత్మ హత్యలు, ప్రేమలు- పెళ్లిళ్లు వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం, వయసు రాలేదు. అనవసరంగా పసి మనుసుల్లో నెగటివ్ విషయాలు చొప్పించకండి. వీటిని మేము పిల్లలతో చరించడానికి రెడీగా లేము ", "తలితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నల్ని మార్చండి ."-- నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి ఇచ్చిన ఆదేశం. నిన్న నా క్లాస్. క్లాస్ తరువాత క్వశ్చన్- ఆన్సర్ సెషన్.
ఆ సెషన్‌లో ఏడవ తరగతి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలు కొన్ని . 1 . మా అపార్ట్‌మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్నాప్ చాట్‌లో ఇంకో అమ్మాయితో చాట్ చేస్తోంది. నేను చూసి అది అమ్మాయి కాదు అని చెప్పాను. ముందుగా నా మాట నమ్మలేదు . తరువాత అది నిజమని తేలింది. ఇప్పుడు వాడు, మా ఫ్రెండ్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు . తాను డిప్రెషన్ లో ఉంది. సూసైడ్ చేసుకుంటానంటోంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి ? 2 . మేము మా అపార్ట్‌మెంట్ బయట ఆడుకొంటాము. ఆ టైంలో ఎక్కడినుంచో ఒక గ్యాంగ్ అబ్బాయిలు వస్తారు. మమ్మల్ని టీజ్ చేస్తారు. వల్గర్ మాటలు మాట్లాడతారు . ఒక అంకుల్కి చెప్పాము . అయన అక్కడ ఉన్నప్పుడు వారు రారు. అయన వెళ్ళిపోగానే మళ్ళీ వస్తారు . ఏమి చెయ్యాలి ?
౩. మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు మాకు నిక్ నేమ్ పెడుతున్నారు. మమల్ని వేరే అబ్బాయిలతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. మన స్కూల్ ఇది తక్కువ. మా అపార్ట్‌మెంట్ ఫ్రెండ్స్ అయితే, వారి స్కూల్లోఇది ఇంకా ఎక్కువ తట్టుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏమి చెయ్యాలి. 4 . అబ్బాయి తప్పు చేసినా, పెద్దలు అమ్మాయినే నిందిస్తారు . ఎందుకు ? 5 . పొట్టి బట్టలు వేసుకొంటే పెద్దలు అమ్మాయిని తప్పుపడుతారు . అబ్బాయికి సంస్కారం చెప్పారా ?. 6 . తన బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు . నేనేమి చెయ్యాలి ? 7 . ఏదో తరగతిలో ప్రేమ లో పడడం తప్పు . కానీ అబ్బాయిలను బెస్ట్ ఫ్రెండ్ చేసుకొంటే తప్పు అవుతుందా ? 8 . మా బంధువుల అమ్మాయి ... 25 ఏళ్ళు వుండొచ్చు. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని హుస్బేండ్స్ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. లేదా బ్రేక్ అప్ అయిపొయింది. కాబట్టి పెళ్లి చేసుకోనటోంది. ఏమి చెయ్యాలి ? సునామిలా ఇలా ప్రశ్నలు వరుసగా దూసుకొస్తూనే వున్నాయి.
వారికి అర్థం అయ్యే రీతిలో అన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఉదాహరణకు ఎనిమిదో ప్రశ్న కు .. ఔటర్ రింగ్ రోడ్డు పై... హైదరాబాద్ - విజయవాడ హై వే ప్రతి రోజు కొన్ని ప్రమాదాలు - మరణాలు జరుగుతున్నాయి . కాబట్టి నేను రోడ్డుపై ట్రావెల్ చెయ్యను . మలేసియా విమానం, నేపాల్ విమానం కూలిపోయాయి . కాబట్టి నేను విమానం ఎక్కను - హాల్లో నవ్వులు . గుండెపోట్లు ఎక్కువగా వ్యక్తి నిద్రపోతున్న సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇక నిద్రే పోను ... ఇంకా పెద్ద పెట్టున నవ్వులు. అసలు గుండె ఉంటేనే గుండెపోటు. కాబట్టి నేను గుండెను తీసేస్తాను .. పగల బడి నవ్వులు. ప్రతి సంవత్సరం టీచర్లను ఇంకా ఎగ్జిక్యూటివ్స్ను ఎంపిక చేస్తుంటాను.
నిజానికి ఒక తప్పు చేస్తే .. పిల్లల్ని చెరపట్టే ఫెడోఫిలిస్ట్ని ఎంపిక చేస్తే ? రిస్క్ ఉంది కదా ? అవతలివారి సైకాలజీని అర్థం చేసుకొనే సామర్థ్యము అంటే సామజిక తెలివి తేటలు పెంచుకొని ముందుకు సాగుతున్నాను . జీవితంలో తన పెర్సనాలిటీ ఏంటో తెలుసుకొని తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో నిర్ణయించాలంటే మానసిక పరిణతి కావాలి . ఏదో ఎర్రగా బుర్రగా వున్నాడు. స్వీట్ మాటలు చెబుతున్నాడు. మహేష్ బాబులా వున్నాడు అని ట్రాప్ లో పడితే లైఫ్ నాశనం. పెద్ద చదువులు చదివినా.. మంచికి చెడుకి తేడా తెలియని బేలతనంతో ఈజీగా మోసపోతున్నారు.
కాబట్టి మంచిగా చదువుపై దృష్టి పెట్టి .. మీరు స్లెటర్స్, కాబోయే లీడర్స్‌గా, అలాగే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ ఎంపతీ, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటలిజెన్స్-- మీలో పెంపొందాలే చూసుకోండి. ఈ క్లాస్ అందుకే . దయచేసి తల్లిదండ్రుల్లారా ముందుగానే మేల్కోండి వారికి పెద్దయ్యాక మంచి చెడు చెబుదామని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీకి వారికి అన్ని తొందరగానే అర్థమైపోతున్నాయన్న విషయం ఈ సెషన్‌లో వారడగిన్న ప్రశ్నల తీరే నిదర్శనం. సో ముందుగానే పిల్లలని గమనించి మంచి చెడు చెప్పి పక్కదోవ పట్టకుండా కాపాడుకోండి.
వాసిరెడ్డి అమర్ నాథ్
మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త
Comments
Please login to add a commentAdd a comment