mind set
-
చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..
మా అమ్మాయి పసికూన" .. "అబ్బాయి బుడ్డోడు" .. "ఇంకా ఏమీ తెలియదు" . ఇదే తల్లితండ్రుల ఆలోచనలు . మీ ప్రేమ చల్లగుండా. పిల్లలు దేవుడు చల్లని వారే .. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. కానీ ..మధ్యలో స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ టీవీలు దురాయి స్వామి. అమాయకత్వం అర్హత కాదు. గురువు / తల్లితండ్రి సరైన రీతిలో ఎడ్యుకేట్ చెయ్యకపోతే పిల్లలు బయటి సమాజం నుంచి నేర్చుకొంటారు . చెడుదారిలో వెళ్లి పోతారు ." అయ్యో .. అప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా చేస్తుందని అనుకోలేదు" అని అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి ? దీని గురించి మానసిక శాస్త్ర పరిశోధకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్ధాం. ఒకసారి నేను హైస్కూల్ పిల్లలకు ఇచ్చిన హోం టాస్క్‌లో..ఐఐటీ విద్యార్థులు కూడా, ఆత్మ హత్యలు చేసుకొంటున్న ఘటనలు జరుగుతున్నాయి . దీనికి గల కారణాలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించండి. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య చదివిన కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణాలను, పరిష్కార మార్గాలను చర్చించండి, తదితరాల గురించి ఇచ్చాం. వారు ఇంట్లో తల్లిదండ్రులతో అవసరమయితే బంధువులతో చర్చించి సమాచారం సేకరించి చర్చకు సిద్ధం కావాలి. అటుపై క్లాస్ రూమ్ లో మెంటార్ పర్యవేక్షణలో డిబేట్ జరుగుతుంది. కొంతమంది తల్లితండ్రులు ఈ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. "మా పిల్లలు ఇంకా పసివారు. వారికి ఆత్మ హత్యలు, ప్రేమలు- పెళ్లిళ్లు వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం, వయసు రాలేదు. అనవసరంగా పసి మనుసుల్లో నెగటివ్ విషయాలు చొప్పించకండి. వీటిని మేము పిల్లలతో చరించడానికి రెడీగా లేము ", "తలితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నల్ని మార్చండి ."-- నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి ఇచ్చిన ఆదేశం. నిన్న నా క్లాస్. క్లాస్ తరువాత క్వశ్చన్- ఆన్సర్ సెషన్. ఆ సెషన్లో ఏడవ తరగతి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలు కొన్ని . 1 . మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్నాప్ చాట్‌లో ఇంకో అమ్మాయితో చాట్ చేస్తోంది. నేను చూసి అది అమ్మాయి కాదు అని చెప్పాను. ముందుగా నా మాట నమ్మలేదు . తరువాత అది నిజమని తేలింది. ఇప్పుడు వాడు, మా ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు . తాను డిప్రెషన్ లో ఉంది. సూసైడ్ చేసుకుంటానంటోంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి ? 2 . మేము మా అపార్ట్మెంట్ బయట ఆడుకొంటాము. ఆ టైంలో ఎక్కడినుంచో ఒక గ్యాంగ్ అబ్బాయిలు వస్తారు. మమ్మల్ని టీజ్ చేస్తారు. వల్గర్ మాటలు మాట్లాడతారు . ఒక అంకుల్‌కి చెప్పాము . అయన అక్కడ ఉన్నప్పుడు వారు రారు. అయన వెళ్ళిపోగానే మళ్ళీ వస్తారు . ఏమి చెయ్యాలి ? ౩. మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు మాకు నిక్ నేమ్ పెడుతున్నారు. మమల్ని వేరే అబ్బాయిలతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. మన స్కూల్ ఇది తక్కువ. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే, వారి స్కూల్లోఇది ఇంకా ఎక్కువ తట్టుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏమి చెయ్యాలి. 4 . అబ్బాయి తప్పు చేసినా, పెద్దలు అమ్మాయినే నిందిస్తారు . ఎందుకు ? 5 . పొట్టి బట్టలు వేసుకొంటే పెద్దలు అమ్మాయిని తప్పుపడుతారు . అబ్బాయికి సంస్కారం చెప్పారా ?. 6 . తన బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు . నేనేమి చెయ్యాలి ? 7 . ఏదో తరగతిలో ప్రేమ లో పడడం తప్పు . కానీ అబ్బాయిలను బెస్ట్ ఫ్రెండ్ చేసుకొంటే తప్పు అవుతుందా ? 8 . మా బంధువుల అమ్మాయి ... 25 ఏళ్ళు వుండొచ్చు. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని హుస్బేండ్స్ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. లేదా బ్రేక్ అప్ అయిపొయింది. కాబట్టి పెళ్లి చేసుకోనటోంది. ఏమి చెయ్యాలి ? సునామిలా ఇలా ప్రశ్నలు వరుసగా దూసుకొస్తూనే వున్నాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఉదాహరణకు ఎనిమిదో ప్రశ్న కు .. ఔటర్ రింగ్ రోడ్డు పై... హైదరాబాద్ - విజయవాడ హై వే ప్రతి రోజు కొన్ని ప్రమాదాలు - మరణాలు జరుగుతున్నాయి . కాబట్టి నేను రోడ్డుపై ట్రావెల్ చెయ్యను . మలేసియా విమానం, నేపాల్ విమానం కూలిపోయాయి . కాబట్టి నేను విమానం ఎక్కను - హాల్లో నవ్వులు . గుండెపోట్లు ఎక్కువగా వ్యక్తి నిద్రపోతున్న సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇక నిద్రే పోను ... ఇంకా పెద్ద పెట్టున నవ్వులు. అసలు గుండె ఉంటేనే గుండెపోటు. కాబట్టి నేను గుండెను తీసేస్తాను .. పగల బడి నవ్వులు. ప్రతి సంవత్సరం టీచర్లను ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌ను ఎంపిక చేస్తుంటాను. నిజానికి ఒక తప్పు చేస్తే .. పిల్లల్ని చెరపట్టే ఫెడోఫిలిస్ట్ని ఎంపిక చేస్తే ? రిస్క్ ఉంది కదా ? అవతలివారి సైకాలజీని అర్థం చేసుకొనే సామర్థ్యము అంటే సామజిక తెలివి తేటలు పెంచుకొని ముందుకు సాగుతున్నాను . జీవితంలో తన పెర్సనాలిటీ ఏంటో తెలుసుకొని తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో నిర్ణయించాలంటే మానసిక పరిణతి కావాలి . ఏదో ఎర్రగా బుర్రగా వున్నాడు. స్వీట్ మాటలు చెబుతున్నాడు. మహేష్ బాబులా వున్నాడు అని ట్రాప్ లో పడితే లైఫ్ నాశనం. పెద్ద చదువులు చదివినా.. మంచికి చెడుకి తేడా తెలియని బేలతనంతో ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి మంచిగా చదువుపై దృష్టి పెట్టి .. మీరు స్లెటర్స్, కాబోయే లీడర్స్‌గా, అలాగే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ ఎంపతీ, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటలిజెన్స్-- మీలో పెంపొందాలే చూసుకోండి. ఈ క్లాస్ అందుకే . దయచేసి తల్లిదండ్రుల్లారా ముందుగానే మేల్కోండి వారికి పెద్దయ్యాక మంచి చెడు చెబుదామని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీకి వారికి అన్ని తొందరగానే అర్థమైపోతున్నాయన్న విషయం ఈ సెషన్లో వారడగిన్న ప్రశ్నల తీరే నిదర్శనం. సో ముందుగానే పిల్లలని గమనించి మంచి చెడు చెప్పి పక్కదోవ పట్టకుండా కాపాడుకోండి. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
బడిబాట
నిశ్చేష్టున్నయ్యాను ఒక్కసారిగా.అటెండర్ రెట్టించాడు – ‘‘గా పిల్ల మందు తాగిందట సార్..’’‘‘ఏ పిల్ల..?’’‘‘అదేసార్.. గా రంగులోల్ల పిల్ల. అప్పుడప్పుడస్తది సూడుండ్రి..’’నాకెందుకో మనసులో అలజడి మొదలైంది. ‘‘ఏం జరిగింది?’’‘‘పురుగుల మందు తాగిందట. పాణం పోలేదనుకోండ్రీ...’’నా గుండె లయ తప్పింది. అటెండర్ చెబుతున్నది ఆ అమ్మాయి గురించేనా? రాజేశ్వరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా? ఎందుకు? ఇది నాకేమైనా చుట్టుకుంటుందా?అమ్మాయి పట్ల జాలికన్నా నా కెరీర్ పట్ల అప్రమత్తత ఎక్కువైంది నాకు. ఏమాటా అనకుండా స్కూల్లో పాఠాలు చెప్పడమంటే కుదిరేపనేనా?అయినా తను ఎప్పుడు సక్రమంగా బడికొచ్చిందని? పది రోజులకోసారి వస్తుంది. రెండు మూడు రోజులు క్లాసులో కనిపిస్తుంది. మళ్లీ వారం పదిరోజుల వరకు బడి ముఖం చూడదు. కాస్త గట్టిగా మందలిస్తేమొత్తానికే రాదు. లేదంటే ఇలాంటి అఘాయిత్యాలు. ఇట్లా రోజుల తరబడి రానివారి సంఖ్య దినదినం పెరిగిపోతోంది. పల్లెల్లో ఉద్యోగాలు వెలగబెట్టడం కత్తిమీద సాములా మారింది మరి!అందరికీ చదువు రావాలి! కానీ బడికి మాత్రం సక్రమంగా రారు. రానివాళ్లను బడికి రప్పించాలంటే తలప్రాణం తోకలోకొస్తుంది. ఇట్లాంటి సంఘటనలేమైనా జరిగినప్పుడు తిరిగి తిరిగి మన తలకే చుట్టుకుంటుంది. అయినా తల్లిదండ్రుల మనస్తత్వాల్లోనూ మార్పు రావాలి. తోచినప్పుడు బడికి పంపిస్తారు. పెండ్లీలకు, పేరంటాలకు, సొంతపనులకు తిప్పుతారు. చదువు రాకుంటే చదువు రావడం లేదంటారు. మాటిమాటికీ బడి ఎగ్గొట్టే వాళ్లకు ఎప్పుడో ఓసారి మందలించినా.. కోపంతో ఓ దెబ్బవేసినా వెంటనే పేరెంట్స్ దిగిపోయి సదరు పంతుల్ని తూర్పారబడతారు. పత్రికలవాళ్లు ఫొటోలు తీసి ‘పిల్లల పట్ల ఉపాధ్యాయుడి వేధింపులు’, విద్యార్థిని చితకబాదిన బడిపంతులు’ వంటి శీర్షికలతో చిలువలుపలువలు చేస్తారు. మరి బడికి చుట్టపు చూపులా అప్పుడప్పుడూ వచ్చిపోయే విద్యార్థుల గురించి ఉపాధ్యాయుడేం చేసేది?‘‘ఎప్పుడోసారచ్చే పిల్ల, గాపిల్ల గురించి గంత ఆలోచించేదేముంటది సార్!’’ అన్నాడు అటెండర్.ఆలోచించాల్సిన విషయమే!రాజేశ్వరి మూడు రోజుల్నుంచి బడికి రావడంలేదు. ఈ మధ్య గత పదిరోజుల్నుండీ వరుసగా వస్తోంది. అంతకు ముందు రెండ్రోజులు బల్లో ఉంటే వారం రోజులు ఇంట్లో ఉండేది. ఎంత చెప్పినా వినేది కాదు. ఉలకదూ పలకదూ. తల్లిదండ్రుల్ని తీసుకురమ్మన్నా తీసుకురాదు. గట్టిగా చెబితేతెల్లవారి నుండి మళ్లీ కనిపించదు.మళ్లీ ఎప్పుడో చుక్కతెగి రాలిపడినట్లు ఊడిపడుతుంది. పదిరోజుల కింద వచ్చినప్పుడు మాత్రం గట్టిగా మందలించాను. ఆ రోజు క్లాస్‌రూంలో ఏం మాట్లాడానో నాకింకా గుర్తుంది. ‘‘ఇంతకాలం ఎక్కడికెళ్లావు తల్లీ?’’ నా అరుపులకు ఆమె నుంచి ఏ సమాధానం లేదు.‘‘మాట్లాడవేం.. ఎటెళ్లావు?’’. ఆమె ఎటెళ్లలేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.‘‘మరి ఇంట్లో ఏం చేశావు?’’నిశ్శబ్దం.‘‘బీడీలు చేసింది సార్,’’ ఎవరో గొణిగారు పక్కనుండి. ‘‘అవునా..?’’ఆమె నుంచి ఏ సమాధానం లేదు. వాళ్ల సమస్యకన్నా ఒకరకంగా వాళ్ల మౌనమే చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. నేను కఠినంగా అన్నాను – ‘‘వస్తే రెగ్యులర్‌గా బడికి రా, లేకుంటే బీడీలే చుట్టుకో! ఏ ఒకదానికో తగలడు తప్ప రెండు పడవల మీద కాలు పెడ్తానంటే కుదరదు’’.ఆమె పల్కలేదు.నాకు మరింత మండింది. ‘‘ఏం.. నోరు పడిపోయిందా? తగుదునమ్మా అని పదిహేను రోజులకోసారి రావడానికి ఇది అత్తగారిల్లా ఏం? తొమ్మిదో తరగతిలోనే బీడీలు చుట్టడంపై మోజుపడితే ఇంక పదేం చదువుతావు? ఇంటికెళ్లిపో..’’ అన్నాను కోపంగా. ఆమె నుంచి మారుత్తరువు లేదు. ఇంకా గట్టిగా అంటే ఏడ్చేలా ఉంది తప్ప సమాధానం చెప్పేలా లేదు.నాకు సహనం నశిస్తుంటే.. ‘‘చెప్పు.. ఇకనుండైనా రెగ్యులర్‌గా వచ్చేదుంటే క్లాస్‌లో కూర్చో, లేదంటే ఇప్పుడే వెళ్లిపో,’’ కఠినంగానే అయినా స్పష్టంగా చెప్పాను.ఆమె వస్తానన్నట్లు తల ఊపింది. ఇట్లా చాలామంది చాలాసార్లు చెప్పారు కానీ ఆచరించేది తక్కువ. ‘‘రెండ్రోజులు వరుసగా బడి మానేసినా మళ్లీ క్లాసులోకి రానివ్వను.’’ అన్నాను హెచ్చరిస్తున్నట్లుగా. ఆమె అవును కాదన్నట్లు తల ఊపి కూర్చుండిపోయింది.అప్పట్నుంచి∙పదిరోజులపాటు వరుసగా హాజరైంది. ఏమైందో ఏమో మళ్లీ రెండ్రోజులు రాలేదు. మూడోరోజు ఇదిగో ఇట్లాంటి వార్త వినాల్సి వచ్చింది.‘‘ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది?’’ ఉన్నట్లుండి ప్రశ్నించాను అటెండర్ని.‘‘తెల్వదు సార్! దవఖాన్లకు తీస్కపోయచ్చిండ్రట, గంతే తెల్సు..’’‘‘పద.. వెళ్దాం..’’ లేచాను.‘‘ఎక్కడికి? గా పిల్లింటికా? మంచిగుండదేమో సార్!’’ అన్నాడు నసుగుతూ.‘‘వెళ్లకుంటేనే మంచిగుండదు, పదా!’’ అంటూ ముందుకు నడిచా. హెడ్మాస్టర్కు చెప్పి బయలుదేరాను. అటెండర్ ముందు నడుస్తున్నాడు. ఊళ్లోని ఇండ్లు అతనికి బాగా పరిచయం. రాజేశ్వరిఇల్లు ఊరికి ఆ చివర్లో ఉంది. పది నిమిషాలు పట్టింది నడకకు. అటెండర్ ఇల్లు చూపించి పక్కనే చింతచెట్టు కింద కూర్చుండిపోయాడు. శిథిలావస్థలో ఒకే గదితో ఉన్న పాతకాలపు మట్టిల్లు అది. ఈ రోజుల్లో అట్లాంటి ఇండ్లలో ఉండటం సాధ్యం కానిది. ముందు ద్వారానికి సూటిగా ఇంటివెనక్కి ద్వారం ఉంది. వెనకవైపు పొలాలున్నాయి. ఊరు చివర్లో ఉండటం వల్ల పెద్దగా మనుషులు కనిపించడం లేదు.పక్కింటిపరంధాములు దూరం నుంచి మమ్మల్ని చూసి మావైపు రావడం కనిపించింది.ఇంట్లో అలికిడి లేదు. అతనొచ్చేవరకు వాకిట్లో నిలుచున్నాను. పరంధాములు దగ్గరకు రాగానే విష్ చేశాడు. ‘‘పిల్లని సూద్దమని వచ్చిండ్రా సారూ!’’ అంటూ పక్కనే ఉన్న తన ఇంట్లో నుంచి రెండు చైర్లు తీసుకొచ్చాడు. పెళ్లలుగా మట్టి రాలుతున్న ద్వారంలోంచి లోనికి అడుగుపెట్టాం. ఒకే ఒక్క కుక్కి మంచంపైన జీవచ్ఛవంలా పడి ఉంది రాజేశ్వరి. ఇంట్లో కూచోవడానికేమీ లేవు. పరంధాములు తన ఇంట్లో నుంచి తెచ్చిన కుర్చీలు వేసి కూచోమన్నాడు. పక్కన తను కూచున్నాడు. మమ్మల్ని చూసి భయపడుతున్నట్లుగా ఇంటివెనక ద్వారం పక్కనే నక్కింది రాజేశ్వరి చెల్లెలు మహేశ్వరి. తను ప్రైమరీలో ఐదో తరగతి చదువుతోంది. వెనకే మరోపాప కూడా ఉంది. తను కూడా చెల్లెలేమో! ఇంకెవరూ లేరు.అయితే గదిలో మూలకు కాళ్లమీద కూర్చొని ఉంది ఓ నడివయస్కురాలు. తల్లేమో. చిందరవందర జుట్టు, అక్కడక్కడా చిరుగులు పడిన చీర, జీవంలేని కళ్లతో కొంచెం వింతగా తోచింది. మమ్మల్ని చూసినా ఆమెలో కదలిక లేదు. ‘‘ఎట్లా ఉందమ్మా రాజేశ్వరికి?’’ ఆమెని ప్రశ్నించాను. ఉలుకూ–పలుకూ లేదు. అట్లాగేనిర్వికారంగా చూస్తోంది శూన్యంలోకి. కూతురు పరిస్థితికి ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదేమో!రాజేశ్వరి నిద్రలోనే ఉన్నట్లుంది.మాటలు ఎట్లా కలపాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘వీళ్లు మీకు బంధువులా’’ అన్నాను పక్కనున్న పరంధాములుతో. కాదన్నట్లు తల ఊపాడు.‘‘అసలేం జరిగింది.. మీకేమైనా తెల్సా?’’ అన్నాను కల్పించుకొని. అతను కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు. ‘‘జరగడమంటే ఏం జరుగుతుంది సార్? ఆ బీడీల కార్ఖాన భీమడు దీనికి ‘ఆకు ఎయ్యనుపో..’ అన్నడట. రెండ్రోజులు కార్ఖానా చుట్టూ తిరిగితే ఆడు ఆకెయ్యలే, తంబాకు పొయ్యలే. గంతే! దానికి ఏమనిపించిందో ఏమో! గీపని జేసింది’’.నేను విస్తుబోయి నోరెళ్లబెట్టాను. మంచిదేగదా! ‘‘పోతేపోనీ.. వెధవ బీడీలు. చక్కగ బడికొచ్చి చదువుకోవచ్చు కదా!’’ అన్నాను. సాలోచనగా చూశాడు పరంధాములు నా మొహంలోకి. ‘‘మరి కడుపుకు అన్నమెవలు బెట్టాలి సార్? ఆ చిన్న పిల్లల్ని ఎవలు సాకాలి సార్?’’ అన్నాడు.కమ్చీతో ఎవరో కొట్టినట్లనిపించింది మొహం మీద. ‘‘అంటే.. వీళ్ల నాన్న.. అమ్మా...?’’ నా మాటలు పూర్తిచేయలేదు. ‘‘నాయన చచ్చిపోయిండు’’.నేను అదిరిపడ్డాను.అతను చెప్పడం కొనసాగించాడు – ‘‘నాయన వీళ్ల బతుకుల్ని మారుద్దామని చెప్పి దూరదేశం బోయిండు. ఆడనే చనిపోయిండు. ఆడు చనిపోయిన్నుండి ఇది.. ఈ తల్లి.. ఇగో ఇట్లా మారిపోయింది. ఇప్పుటికి మూడేండ్లాయె! ఆడు సచ్చినప్పుడు నాలుగేండ్లు కూడా నిండని ఆ చిన్నపిల్లతో సహాఇద్దరు చెల్లెండ్లను తనే చూసుకుంటూ ఆ బీడీల మీద బతుకీడ్చుకత్తుంది ఈ పిల్లే! ఆళ్ల పరిస్థితి జూసే ఈ ఇల్లు కిరాయికిచ్చిన. ఇప్పటికి ఆర్నెల్లాయె, కిరాయిగూడా ఇయ్యలే!’’నాకు మాటలు పెగలడం లేదు. అలా చూస్తుండిపోయాను. వెనక.. తలుపు దగ్గర్నుండి ఇద్దరు పిల్లలు తొంగి చూస్తున్నారు మేం వెళ్లామో లేదోనని. పిలిచాన్నేను – ‘‘అన్నం తిన్నావా?’’అడ్డంగా తల ఊపింది మహేశ్వరి.‘‘ఏం.. ఎందుకని?’’‘‘వండలేదు. అక్క లేవలేదుకద సార్?’’‘‘అమ్మ వంట చేయలేదా?’’‘‘అమ్మ చేయదు. అక్కే చేస్తుంది. అసలు అమ్మ ఏం చేయదు..’’ నాకు నోట మాట రాలేదు. నా సంశయం అర్థం చేసుకున్నట్లు ‘‘అవును సార్, అగో సూడుండ్రి. భర్త పోయినంక పిచ్చిదై పోయిందంతే... అదే వాలకం. ఉలకది పలకది. అన్నం పెడితే తింటుంది. లేకుంటే అట్లనే ఉంటుంది. వంటచేసేది, చెల్లెల్లనీ, తల్లినీ చూసుకునేది రాజేశ్వరే! తను బీడీలు చేస్తేగాని పొట్ట గడవది..’’ అన్నాడు పరంధాములు.నాకు తల మొద్దుబారినట్లయింది. నాలో నేను అనుకొన్నట్లుగా ‘‘రాజేశ్వరి రోజుల తరబడి బడి మానేసేది..?’’ అన్నాను.‘‘బడికొస్తే వీళ్లనొవలు సూడాలి సార్? అసలు వాళ్ల పొట్టెట్టా గడవాలి? ఆ పిల్ల బీడీల గంప ముందెట్టుకుంటేనే నాలుగు పైసలు. అవుంటేనే ఆళ్లకు తిండి. అటువంటిది పదిరోజుల పాటు బీడీలు మానేసి బడికొచ్చినందుకు ఆ భీమడు ఆకెయ్యనన్నడు. దానికేం బుద్ధి పుట్టిందో..! ఆ పిచ్చితల్లికి, ఈ అమాయకపు చెల్లెండ్లకు తిండెలా పెట్టాలనుకుందో.. ఏదనుకుందో..? మా ఇంటెనుక పురుగుల మందు డబ్బలో నీళ్లు కలుపుకొని తాగింది. ఈ మధ్య దాని వాలకం పసిగడుతున్నోడ్ని గనుకే ఎంటనే దవఖానకు తీస్కెల్లినా. లేకుంటేనా..’’ ఆ చిన్నపిల్లల వైపు చూస్తూ.. పరంధాములు గొంతు తడబడింది.నిద్రలో ఉన్న రాజేశ్వరి తలపై చేయుంచి నిమురుతున్న నా మనసు విచలితం అవుతుంటే ఆ ఇద్దరు చిన్నారులను దగ్గరకు తీసుకున్నాను. ‘‘మీ అక్కయ్యకు ఏమీ కాదు. మేమంతా ఉన్నాం కదా! అయినా ఆకలేస్తలేదా మీకు?’’ మహేశ్వరి బిడియంగానే అంది – ‘‘అమ్మ కూడా తిన్లేదు సార్, చెల్లేమో ఆకలని ఏడుస్తోంది. అక్క లేస్తలేదాయె..’’ కాస్త ఆగి ‘‘బడికొస్తే పెడతారుగదా సార్! రేపొస్తాము’’. కరుకు రంపంతో కఠిన హృదయాన్ని సైతం ఖండఖండాలుగా కోస్తున్నట్లు... నాలోని అవివేకతను.. అసమర్థతనూ నిలువెల్లా కాల్చి దహిస్తున్నట్లు.. నా అసహాయతకు నన్ను నేనే నిందించుకొంటూ, నాకు నేనే కుచించుకుపోతున్న భావన.ఎంత అవివేకం?తరగతి గదిలో రోజుల తరబడి బడికి హాజరుకాని పిల్లల నిశ్శబ్ద నిర్వేదం వెనుక రోదననీ, వేదననీ పసిగట్టలేని అసమర్థ నిర్వాకం ఎందరి చిన్నారుల హృదయాలను భగ్నం చేస్తోందో! ఈటెల మాటలు ఆ పసిడి మనసులను ఎంతగా పరితపింపజేస్తాయో!పిల్లల తెరవెనుక నేపథ్యాన్ని చదవకుండా ఎన్ని చదువులు చెప్పినా ఎంత వృత్తి నిబద్ధత ప్రదర్శించినా వృథాయేనన్న సత్యం నాకు బోధపడుతూంటే అంతే నిర్వేదంగా లేచాను. చదువు చెప్పడంతో పాటు సమాజంలో వాళ్లు బతుకీడుస్తున్న విధానాల్నీ చదవాలని, చదువుతో పాటు ప్రభుత్వపరంగా వాళ్లకు అందాల్సిన పథకాల గురించి చెప్పాలని నా మనసు ఉద్భోదించింది.విద్యావ్యవస్థ నిర్వహించాల్సిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయని.. అందులో భాగస్వామినైన తనకూ ఆ బాధ్యతలతో సంబంధం ఉందన్న సత్యం బోధపడుతూంటే.. ప్రస్తుతానికి ఆ ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకొని పాఠశాలవైపు అడుగులు వేశాను. - కటుకోజ్వల మనోహరాచారి -
నెగటివ్ షేడ్
అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు బాలీవుడ్ నటుడు ఆదిత్యా పాంచోలి. పెద్దగా క్యారెక్టర్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఇతగాడి మైండ్ సెట్ కూడా అవుటాఫ్ ఆర్డర్లో ఉన్నట్టుంది. సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ సెట్స్‌లో మనోడు రచ్చ రచ్చ చేశాడట. షూటింగ్‌కు లేటుగా వచ్చింది కాక... కొంతమంది యూనిట్ సభ్యులతో దురుసుగా ప్రవర్తించాడట. అంతటితో ఆగకుండా మరికొందరిని పని చేయకుండా అడ్డుకున్నాడట. రావడమే బ్యాడ్ టెంపర్‌తో కనిపించిన ఆదిత్యను దర్శకుడు వెంటనే ఇంటికి పంపించేశాడట. తెల్లారి ఉదయం మళ్లీ సెట్స్‌కు వచ్చిన టెంపర్ బాయ్ చాలా కూల్‌గా ఉన్నాడనేది మిడ్ డే కథనం. అంతే కాదు... అందరికీ సారీ చెప్పి వర్క్ మొదలెట్టాడట. ఎవరి మీద కోపమో ఇంకెవరిమీదో చూపించి అభాసు పాలయిన ఆదిత్య... ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు.! -
ఈ తప్పులతో.. తప్పవు తిప్పలు
ఆదాయం ఎంత ఆర్జిస్తున్నా, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనుకున్నా.. కొన్ని తప్పిదాలు దొర్లుతూనే ఉంటాయి. వాటి వల్ల ఆర్థిక పరిస్థితులు చిందర వందర అవుతుంటాయి. ఇలాంటివే కొన్ని తప్పిదాలు, వాటిని ఎదుర్కొనేందుకు తోడ్పడే కొన్ని పరిష్కార మార్గాలు ఇవి. క్రెడిట్ కార్డు బకాయిలు.. క్రెడిట్ కార్డులు వాడకోవడం.. క్రెడిట్ రికార్డు మెరుగ్గా ఉంచుకోవడం అభిలషణీయమే. గడువులోగా సమయానికి కార్డు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేయగలిగితే ఇది మంచిదే. కానీ, తర్వాతెప్పుడో కట్టొచ్చు కదా అన్న ధీమాతో భారీ వస్తువులతో పాటు చిన్నా, చితకా కొనుగోళ్లకు కూడా క్రెడిట్ కార్డు బైటికి తీయడం అలవాటుగా మార్చుకోవద్దు. తీరా కట్టాల్సి వచ్చినప్పుడు సమయానికి డబ్బు సమకూరకపోతే.. బకాయి కొండలా పేరుకుపోతుంది. వడ్డీల మీద వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో చిక్కుకోకూడదంటే.. తర్వాత కట్టొచ్చులే అన్న మైండ్‌సెట్ నుంచి బైటపడాలి. చేతిలో డబ్బు లేనప్పుడు కొనడాన్ని విరమించుకోవడం ఉత్తమం. ఆదాయాన్ని మించిన ఖర్చులు.. దీని గురించి మరీ విడమర్చి చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కొనే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కొన్ని ఖర్చులు అప్పటికి సబబే అనిపించినా.. ఆ తర్వాత ఆలోచిస్తే ఎంత వృథానో అర్థమవుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే.. 2 నెలల బ్యాంకు స్టేట్మెంటు, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు పోల్చి చూడండి. అనవసరమైన వాటిపై ఎంతెంత ఖర్చు చేశామో తెలుస్తుంది. ఈ అలవాటు నుంచి బైటపడాలంటే.. ఆదాయంలో కనీసం పది శాతమైనా పొదుపు చేయడం ప్రారంభించాలి. మిగిలిన మొత్తాన్నే వ్యయాలకు ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులు.. ఆదాయాలకు లోబడే ఉండేలా చూసుకోవచ్చు. రిటైర్మెంట్ ప్రణాళిక లేకపోవడం.. వ్యయాల విషయానికొస్తే.. ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు వగైరా అనేకానేకం ఉంటాయి. వీటి ధ్యాసలో పడి మిగతా అవసరాల కోసం పొదుపు చేయడం పక్కన పెట్టేస్తుంటాం. పిల్లల కాలేజీ ఫీజులు లాంటి ఖర్చుల కోసం కావాలంటే ఎక్కడైనా అప్పు దొరుకుతుంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత అవసరాలకు అప్పు పుట్టడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే, ఆదాయం తగ్గిపోవడం వల్ల తిరిగి చె ల్లించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది కదా. కాబట్టి..రేపో, ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు ఆదరాబాదరాగా పరుగెత్తడం కాకుండా, ముందు నుంచే కాస్త జాగ్రత్తపడాలి. కెరియర్ ప్రారంభం నుంచే రిటైర్మెంటు కోసం కూడా కొంత కొంతగా పక్కన పెడుతుండాలి. -
మైండ్ సెట్ మార్చుకోండి...
ఇందూరు, న్యూస్‌లైన్ : విద్యార్థులకు అనుగుణంగా వార్డెన్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్ కూమార్ సూచించారు. బయటి పనుల్లో నిమగ్నమై వసతి గృహానికి వచ్చా మా... పోయామా అన్నట్లుగా ఉండొద్దన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమాధికారులతో, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, సౌకర్యాలను వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను వారికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వార్డెన్లపై ఉందన్నారు. కొత్తగా అమలు చేస్తున్న మెనూను పక్కాగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు ఉన్న భవనాల్లోకి మార్చాలని సూచించారు. అవసరమైతే గ్రామ సర్పంచ్, గ్రామ కమిటీ మెంబర్లతో మాట్లాడి భవనాలను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న వసతి గృహాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజురు చేయిస్తానని అన్నారు. ప్రతి వసతి గృహాంలో అవసరం ఉన్నచోట ఫ్యాన్,బల్బు కచ్చితంగా ఉండాలన్నారు. కొందరు విద్యార్థులు సగం పగిలిన అద్దాల్లో చూసుకుంటున్నారని, వార్డెన్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కొత్తవి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, యూనిఫాంలు లేని విద్యార్థులకు వెంటనే అవి అందేలా సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాస్మోటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని పెండింగ్‌లో ఉంచవద్దన్నారు. విద్యార్థులకు వార్డెన్లు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని కారణం ఏంటనీ ప్రశ్నించగా, ఎవరూ సమాధానం చెప్పకపోడంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుంచి అన్ని స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిణి విమలను అదేశించారు. ప్రతి వార్డెన్‌కు ఒక సబ్జెక్టు వచ్చి ఉండాలని, పిల్లలకు రోజు ఒక గంట బోధించడం లేదా, సందేహాలను నివృతి చేయాలన్నారు. వారికి అన్ని మీరే అన్నట్టుగా ఉండాలన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించాలి చదువులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందించాలని తద్వారా వారిలో పోటీ తత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు,మెనూ ప్రకారం భోజనం,స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి వసతి గృహంలో ల్యాండ్ ఫోన్ ఉండాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుంటామని, దీంతో మీ పనితనం తెలిసిపోతుందన్నారు. మెస్,విద్యా,తదితర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని,నెలకు రెండు సార్లు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తనకు నివేదించాలని సూచించారు. వసతి గృహాలకు సరఫరా అవుతున్న రేషన్ బియ్యం సంచుల్లో తక్కువగా వస్తున్నాయని వార్డెన్లు జేడీకి ఫిర్యాదు చేయగా, అలాంటి బ్యాగులను వెంటనే సివిల్ సప్లయ్అధికారులకు అప్పగించి వేరే బ్యాగులను తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.