విశాఖపట్నం: హైదరాబాద్లో చదువుతున్న కార్తిక్ అనే ఐఐటి విద్యార్థి విశాఖలో అలజడి సృష్టించాడు. కాలేజీ నుంచి ఎవరికీ చెప్పకుండా తప్పించుకున్న విద్యార్థి ఆచూకీ కోసం ఏకంగా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. గత మూడు రోజులుగా విశాఖలో జల్లెడ పడుతున్నా.. ప్రయోజనం లేకుండా పోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17 వ తేదీన కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొన‍్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి విశాఖలో అడుగు పెట్టాడు. అప్పటికీ కాలేజీలో విద్యార్థి మిస్ అయ్యాడని తెలియడంతో తల్లి దండ్రులకి సమాచారం అందించారు. సంగారెడ్డి జిల్లా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలోని బీచ్ రోడ్డులో కార్తీక్ ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్ రావడంతో తెలంగాణ పోలీసులు మూడు రోజుల నుంచి బీచ్ రోడ్డు మొత్తం జల్లెడ పడుతున్న ఎటువంటి లాభం లేకుండా పోయింది. అక్కడే ఓ బేకరి షాప్ లో ఫోన్ పే ద్వారా బన్ కొనుకొని వెళ్ళాడని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.. అయితే ఎప్పుడు ఫోన్ అన్ చేసిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసే లోపు అక్కడ నుంచి మాయం అయిపోవడంతో తల్లిదండ్రుల రోదనకి అంతు లేకుండా పోతుంది.
ఇదీ చదవండి: Suriya Fans Died: కరెంట్ షాక్.. హీరో సూర్య ఫ్యాన్స్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment