గాంధీనగర్ : చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనలు చూశాం. అయితే గుజరాత్‌లో ఓ 10ఏళ్ల బాలుడిపై కోతులు అత్యంత దారుణంగా దాడి చేసి చంపాయి. బాలుడి కడుపును చీల్చి పేగులు బయటికి తీసి మరీ చంపేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సల్కి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దేగామ్ తాలూకాలోని ఓ గుడికి సమీపంలో బాలుడిపై కోతులు దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దీపక్ ఠాకూర్ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చి వారిని భయపెట్టింది.వెంటనే కోతులన్నీ కలిసి బాలుడిపై దూకాయి. అతడి ఒంటిపై చర్మాన్ని తొలగించి గోళ్లు పొట్ట లోపలికి దించి పేగులు బయటికి తీశాయి. దాడి తర్వాత వెంటనే దీపక్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలోనే డాక్టర్లు దీపక్ చనిపోయినట్లు ధృవీకరించారు.
సల్కి గ్రామలో ఈ వారంలోనే కోతులదాడికి సంబంధించి ఇది మూడో ఘటన అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అయితే ఆ రెండు ఘటనల్లో బాధితులను కాపాడినట్లు తెలిపారు. ఇక్కడ మనుఘులపై వరుసగా దాడులు చేస్తున్న కోతులను పట్టుకున్న వారికి వేల రూపాయల రివార్డులను కూడా అధికారులు ప్రకటిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి..ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట!
Comments
Please login to add a commentAdd a comment