వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య | Three Persons Committed Suicide With Different Reasons In Vijayawada | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 10:50 AM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

Three Persons Committed Suicide With Different Reasons In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం కలకలం రేగింది. వివిధ కారణాలతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. నగర శివారులోని వాంబే కాలనీలో నివాసముంటున్న శ్రావణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు మొదలైందని విజయవాడ రూరల్‌ పోలీసులు తెలిపారు.

నగర శివారు ప్రాంత గ్రామంలో..
విజయవాడ శివారులో గల ఓ గ్రామంలో వరదారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్ధిక ఇంబందుల కారణంగా వరదా రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

బీటెక్‌ విద్యార్థి
కృష్ణలంకలో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  కొన ఊపిరితో ఉన్న యువతిని విజయవాడలోని ప్రవేట్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే యువతి చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement