found hanging
-
ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం
Veteran Odia Actor Raimohan Parida Died By Suicide In Bhubaneswar: ఒడియా చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నటుడు రాయ్మోహన్ పరిదా బలవన్మరణానికి పాల్పడ్డారు. 58 ఏళ్ల ఈ వెటరన్ యాక్టర్ శుక్రవారం (జూన్ 24) భువనేశ్వర్‌లోని ప్రాచి విహార్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లో ఉరివేసుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులుగా ఆత్మహత్యగా భావించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాయ్మోహన్ పరిదా ఆత్మహత్యతో ఒడియా సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 'జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నా. అతను తన నటుడిగా ఎంతో విజయవంతమయ్యారు' అని రాయ్మోహన్తో కలిసి నటించిన సిద్ధాంత మహాపాత్ర తెలిపారు. 'జీరో నుంచి హీరోగా మారిన పరిదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నమ్మలేకున్నాం' అని మరో నటుడు శ్రీతమ్ దాస్ పేర్కొన్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ కాగా రాయ్మోహన్ పరిదా ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందినవారు. ఆయన సుమారు 100కుపైగా ఒడియా చిత్రాల్లో నటించారు. అలాగే 15 బెంగాలీ సినిమాల్లో కూడా అలరించాడు. రాయ్మోహన్ పరిదా ఎక్కువగా నెగెటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అంతేకాకుండా రాయ్మోహన్ ప్రసిద్ధ థియేటర్ ఆర్టిస్ట్. రామ లక్ష్మణ్, ఆసిబు కేబే సాజీ మో రాణి, నాగ పంచమి, ఉదండి సీత, తూ తిలే మో దారా కహకు, రణ భూమి, సింఘ బహిని, కులానందన్, కంధేయి ఆఖిరే లుహా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో రాయ్మోహన్ పరిదా నటించారు. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
-
కారుకింద తోసి చంపిన డీఎస్పీ.. అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ ఓ వ్యక్తిని నెట్టేసి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ హరికుమార్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే, 34 ఏళ్ల సనాల్ మృతికి కారణమైన హరికుమార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. కాగా, ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మాట్లాడుతుండగానే కారుకింద తోసేశాడు..!) ఇదిలాఉండగా.. సనాల్ మృతి చెందినప్పటి నుంచి (నవంబర్,5) పరారీలో ఉన్న హరికుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కేరళతో పాటు తమిళనాడులో సైతం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హరికుమార్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు అధికార కమ్యూనిస్టు పార్టీ యత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. నిందితున్ని పట్టుకోవడంలో కావాలనే జాప్యం చేస్తోందని పోలీసు శాఖపై ఆరోపణలు చేశాయి. సనాల్ మృతి అనంతరం డీఎస్పీ హరికుమార్ పారిపోయేందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం కలకలం రేగింది. వివిధ కారణాలతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. నగర శివారులోని వాంబే కాలనీలో నివాసముంటున్న శ్రావణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు మొదలైందని విజయవాడ రూరల్ పోలీసులు తెలిపారు. నగర శివారు ప్రాంత గ్రామంలో.. విజయవాడ శివారులో గల ఓ గ్రామంలో వరదారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్ధిక ఇంబందుల కారణంగా వరదా రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బీటెక్ విద్యార్థి కృష్ణలంకలో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న యువతిని విజయవాడలోని ప్రవేట్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే యువతి చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. -
ఈ దేశంలోనే ఉంటూ పతాకాన్ని తగల బెడతారు
-
నటి అనుమానాస్పద మృతి.. హత్యా?
కోలకత్తా: బెంగాలీ నటీ అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. కోలకతాలోని ఆమె నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించింది. సినీ, టీవీ నటి బితాస్తా సాహా ఫ్లాట్ లోనే బెడ్ రూంలో ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. అయితే ఆమెది ఆత్మహత్యా? లేక అత్యాచారం చేసి హతమార్చారా అనే సందేహాలు నెలకొన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణ కోల్ కతాలోని కాస్బా ప్రాంతంలో సాహా నివాసం ఉంటోంది. గత రెండు రోజులుగా ఆమె ఫోన్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బితాస్తా సాహా తల్లికి అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం ఆమె ఫ్లాట్ కు వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం, ఎంతకీ స్పందన లేకపోవడంతో తల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలు కొట్టారు. కుళ్లిపోయిన స్థితిలో బితాస్తా సాహా శరీరం సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. శరీరంపై పలు చోట్ల గాయాలుతో పాటు రెండు చేతులపైనా తీవ్ర గాయాలు ఉన్నాయి. మణికట్టు విరిచేసి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో సాహా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అత్యాచారం, హత్య అనుమానాలు కూడా కలుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె చనిపోయి రెండుమూడ్రోజులు అయ్యి వుండవచ్చన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, సాహా ఫేస్ బుక్ పోస్టులు పరిశీలిస్తే, ఆమె కొంత డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని వివరించారు. కాగా సాహా ఫేస్ బుక్ ఖాతాలో ‘నా ఆవేదన మీకు ఎప్పటికీ అర్థంకాదు. నా బాధ, ఆవేదనతో నీకు సంబంధంలేదు. నేను చేసిన తప్పేంటి చెప్పు..నా బాధను నీతో చెప్పలేను..నా గుండెకోతను అర్థం చేసుకుంటే..’ తదితర పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె స్నేహితులు, పొరుగువారిని పోలీసులు విచారిస్తున్నారు. 2016లో విడుదలైన ‘బాంచా ఎలో ఫిరే’ సినిమాలో సాహా నటించారు.